పుట:కాశీమజిలీకథలు-12.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

సూర్యభగవానుడు తీవ్ర కిరణములబరసి తీవ్ర శరశిఖరఖండితములగు మృగయా ఖండముల బచనం బొనర్ప నగ్నివలెనే భరింపరాని యెండ గాయుచున్నాడు.


చ. అలఘుకపోలపాళి ననయంబు నిదాఘజలంబుగ్రమ్మఁ గ
    న్నుల కరమోడ్పుగల్గఁగఁ దనూలత వాడఁగ మోముగందఁగాఁ
    జలమున సంచరింతురు నిషాదినులుష్ణకరప్రసక్తిచేఁ
    గలఁగి యనంగసాత్వికవికారము లందినరీతి నియ్యెడన్‌.

మఱియును మధ్యందిన మార్తాండాతపోజ్జృంభణంబును సహింపజాలక పతత్రిజాలంబు లున్నతద్రుమంబులు శిశిరపత్ర పటలాంతరముల నడగియున్నవి. కరికుల ధారాజలనిమజ్జనమునుండి లేచి వచ్చిన షట్పదపటలంబు సూర్యకిరణముల వసి వాడిన కమలకానన లక్ష్మికి బట్టిన నీలాతపత్రమువలె సరోవరమున బ్రవర్తించు చుండెను. ఘర్మాంశుకర నికరమువలన దొడిమలపట్టు జారిపడిన లతాప్రసూన ముకు ళములచే వనభూమియెల్ల గప్పబడుచున్నది. కందర దరీప్రవేశ మొనరింప బరువు లెత్తు వనచరుల పరుషప ద ఘట్టనంబుల గిరితటంబుల కేగిన గైరికరజోపూరములవలన దిశాభాగములన్నియు నెర్రబడి యున్నవి. కావున నో దేవ ! ఇక వేట జాలించి విశ్ర మించుట యొప్పునని సమయోచితముగ వచించిన విజయవర్దనుని మాట లాదరించి యప్పుడే యా భూపాలముఖ్యుండు మృగయాఖేలన వ్యవహార విముఖుండై యా వనమునుండి బయలువెడలెను.

అట్లు బయలు వెడలి యుద్ధురమహాతపసంబాధితంబైన నిజ పరివారము నెల్ల నెచ్చటనైన‌ నొకశీతలప్రదేశమున విశ్రమింపజేసి యాదుస్సహమధ్యాహ్నమును గడుపనెంచి యరుగుచుండ ననతి దూరముననే ముందు పచ్చికబయళ్ళతో, నికుంజ మంజరులతో, సురదారు చందన ఘనసార పున్నాగ పాటలీ నీప చంపక ముచు కుందకేసరాశేత పనసామ్రజంబు జంబీర క్రముక నారికేళ ఖర్జూరకాది సుందర సాంద్రద్రుమ సందోహములతో బహుళశీతలజలాశయములతో, నతిసుందరమగు కుసుమసుందరమను విలాసోద్యానవనమును బొడగాంచెను.

అట్టి రమణీయ ప్రదేశమున గనుంగొని యా రాజోత్తముఁడమందానంద మున నాతపక్లేశ మపనయించుకొన సపరివారముగ నందు విడిసెను. ఆశ్వికుల దిగిన తోడనే పైనున్న జీనులు తీసివేయబడగా కొన్ని గుర్రములు ధూళియందు బొరల దొడంగినవి. కొన్ని దుర్వాస్థలంబుల కరగి మేయసాగినవి. పరిజనులలో గొందరు నిర్ఘరాంబువుల దానమాడిరి. కొందరు తనివితీరినీరంబుల గ్రోలిరి. కొందరు తరు చ్ఛాయల విహరించిరి. కొందరు కూర్పాసకంబుల నూడదీసి చల్లగాలిసుఖ మనుభ వించిరి. కొందరు కేశబంధముల విదళించుకొని యిటునటు దిరుగుచుండిరి కొందరు