పుట:కాశీమజిలీకథలు-12.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పుండరీకుని మృగవనవిహారము

155

నశ్వవారము నిలిపి, మార్గమున ధనుర్ధరులై కాచియుండి, సారమేయముల నుసికొలిపి, యుచితస్థలమున నొకమహోక్షమును గట్టి మాటొగ్గి, దీపమృగకదంబకముం బఱపి నిమసములో నాయడవినెల్ల నాక్రమించిరి. మరియు శ్వాపదవిలోకనార్దమై కందరదరీ ప్రవేశం బొనర్చుచు, గహ్వరముల బరిభ్రమించుచు, పల్వల తటమున నాక్రమించుచు నిర్ఘరతరంగిణుల సమీపమున సంచరించుచు నతి కోలాహలముగ నా మృగయులా వనాంతరమున జెలరేగుచుండ, సమీపభూరుహములనుండి భయకంపితారావంబు లొన రించుచు ప్రాణభీతిఁ బై కెగురు విహంగమ సమూహములును, చెవుల నిక్కబెట్టుకొని పొదల మాటున నుండి పరువులెత్తు శశకనికురుంబములును, సగముకొరుకబడిన దర్భాం కురములు నోటినుండి జూరుచుండ బెదరుచూపులతో నురుకు సారంగకదంబములును, నప్పుడే రొప్పఁబడిన వల్మీకమృత్పిండములఁ గొమ్మలయందుదాల్చి వెనుకకు దిరిగి చూచు సైరభ ప్రకరములును, భూమినెల్ల వలితవదనాగ్రమునఁ బెకలింపగలిగి మాటిమాటికి భీకరఘుర్ఘరారావము లొనర్చు వరాహనివహములును, చిగురుటాకుజొంప ముల నోటి కందించుచుండటదేత వర్తులములగు తుండములతోడను, నంసదేశపాతితము లగు కర్ణతాళంబులతోడను నపాంగమిళితనేత్ర తారకంబులతోడను నొప్పు మదపు టేనుగులగుంపులును క్రోధగర్జారవంబున దిక్కులు పిక్కటిల్లజేయు శార్దూలగణంబు లును గలిగి యా మృగయా కోలాహలంబతి దారుణమయ్యెను.


మ. హరి, కుంభస్థలి నగ్రవామపదమున్‌ హత్తించి వేఱొక్కకా
     లరయన్‌ బేరెదమీఁద నడ్డముగ శూన్యాధారతన్నిల్పి యా
     దరసంకోచమితాళితాస్రమెడలన్‌ దచ్చృుక్వమార్గంబులన్‌
     కరివిచ్చేదనవృత్తిమాని మృగయాకల్లోల మీక్షించెడిన్.

అప్పుడు వేటకాండ్రు హరిణంబుల దాళంబులంబట్టి, వలలొగ్గి పక్షుల నిర్బంధించి, సారమేయంబుల సహాయమున వరాహముల బొడిచి, బాణ ప్రయోగ మున గంఠీరవంబుల సంహరించి, వలయాకారముగ నశ్వముల రొప్పించుచు వ్యాఘ్ర ముల బరిమార్చి, శరభముల బొరిగొని సకలళ్వాపదసంతాపముల రూపుమాపి యమ్మహారణ్యమున నశ్రుతపూర్వముగ నదృష్ట పూర్వంబుగనననుభూత పూర్వ కముగ మృగయాసంరంభమాచరించుచుండిరి.

ఇంతలో నుష్ణాంశుండు గగనశిరోధిరూఢు డగుట దిలకించి విజయవర్థ నుండు వినయమున నా భూపాలున నిట్లనియె. దేవా ! వేట తమకమున నున్న మృగయులెల్ల నీయెండవేడిమిని మిగుల నలసియున్నారు. సర్వవనసత్య సంహారం బొనరించి ధనుర్ధ‌రుల వామకరంబుల బాణాసనంబులదాల్చి యందందు దిరుగు చున్నారు. ఉచ్చండవేగమున బరువు లెత్తింపబడిన యశ్వము లొండొంటిజేరి స్థిమిత పడుచున్నవి. సారమేయంబులు సౌమ్యములై నాల్కలు వ్రేలవైచికొని నిలిచియున్నవి.