పుట:కాశీమజిలీకథలు-12.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

ఇట్లు చిత్రశిఖుండు వేటమాటయనినతోడనే బైట నెవ్వని తోడనో యెవ్వడో మృగయాఖేటనవ్యాపారం బభివర్ణించు మాటలిట్లు వినంబడెను.


మ. కరికుంభస్తనియై మృగీవిశద దృగ్వైదగ్ధ్యయై కేకిసుం
     దరబర్హ చ్చదకుంతల ప్రమదయై నానావిహారస్ఫుర
     ద్వభూదారగభీర ఘోరశితదంష్ట్రాకాంతిసంఘాతయై
     కర మొప్పారు మృగవ్యలక్మి నెనయన్‌ గాపూరుషుండర్హుఁడే?

చిత్రశిఖునిపలుకుల కుపశ్రుతిపలె నొప్పినయామాట లాలించి యారాజ బిడౌజుం డమందానందకందళిత హృదయారవిందుండయి మృగయాఖేటనవినోద విషయము జక్కగా స్మృతికి దెచ్చినందుల కా శుకనాధుం బొగడి యట్టివినోదం బను భవింపఁ గృతనిశ్చయుండై మృగవనగమనాశ్యకములగు నుచిత పాశవాగురసార మేయాద్యుప కరణములతో వేఁటకాండ్ర సంసిద్ధపఱుపఁ బ్రతీహారిముఖమునఁ దగిన వారి కనుజ్ఞ నొసంగెను.

మఱునాటివేకువ నుచితవేషము ధరించి యమ్మహారాజు నవరత్నకాంతుల బ్రదీప్తంబగు జీనుతో నలంకరింపఁబడిన యుత్తమాశ్వమును' నింద్రుండుచ్చైశ్రవమునుం బోలె నధిష్టించి, వేట యందు నేర్పరులైన యనుచర లమితోత్సాహమున ముందు నడువ సమరలీలా వ్యాపారసహచరులగు సామంతనరేంద్ర కుమారులును, మంత్రి సూనుం డగు విజయవర్థనుండును, తురగారూఢులై పార్శ్వముల ననుసరింప, మృగ యులు మార్గము దెలుప, నపరిమితపరివార సమేతుఁడయి వేటకు బయలువెడలెను.

ఇట్లతి‌ వైభవమున గదల యనతికాలముననే యారాజు ముఖ్యుండుమృగయా వ్యసన పరాయణుండై యనేక తరులతాలతాంకుర విరాజమానంబగు నొక మహారణ్య ప్రదేశము సపరివారముగ బ్రవేశించెను. అయ్యది నానావిధవిహంగసందోహ సంకుల నిస్వనముతోడను, పర్వతాగ్రసంపాతిత ప్రవాహారావముతోడను, కుసుమ మధుమదారుణిత షట్పదసమూహ ఝంకారముతోడను, పవన చలితకీచకానేక సంకీర్ణ స్వయముతోడను మిగులభీషణమైయుండె. మరియు నా ప్రదేశమున సంచరత్పతంగనఖ వికీర్ణంబగు కుసుమకింజల్క పూరం బనల్పరజోవృష్టివలె వివిధవర్ణముల భయావహం బయ్యెను. అందనిల తరళిత లతావనప్రసూనపతనము క్షతపాత్రమువలె మృగారిష్ట సూచకముగ నుండెను. తరుశిఖర శాఖాంతరములనుండి దుముకు వానరములబరువుచేఁ గుసుమములు నేల రాలి మహాద్భుతోల్కాపాతమువలె శార్దూలాది సకలసత్వవినాశన మును దెల్పుచుండెను.

అట్టి మహారణ్యమున మృగములసహాయమున నుచితరీతి మృగయావిహారం బొనర్ప బరిజనుల కా రాజేంద్రుం డనుజ్ఞనొసంగెను. తోడనే వారెల్ల రత్యుత్సాహమున గంతులువైచుచు, మృగములఁ బట్ట నురుల నొడ్డి, వలలఁ బన్ని, యంతరాంతరముల