పుట:కాశీమజిలీకథలు-12.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

సమయముల నెల్లప్పుడును మాయానతిని వీనిని మాసమక్షమునకు గొనివచ్చుచుండు మని వసంతశీలున కనుజ్ఞ యొసంగెను. ఇంతలో మాధ్యాహ్నిక సమయసూచకముగ శంఖము మ్రోగెను

ఆ నినద మాలించియుచితవేదియగు నారాజేంద్రుండువసంతశీలున దగిన రీతిని బహూకరించి రత్నపంజర మందున్న చిత్రశిఖుని వాని కప్పగించిపోవ ననుజ్ఞ యొసంగెను. మరియును సన్నిధానవర్తులగు రాజపుత్రకుల నెల్ల వీడ్కొల్పి స్నానాది మాధ్యాహ్నికకృత్యముల నిర్వర్తింప సింహాసనమునుండి లేచెను. అట్లులేచి రెండడు గులు ముందునకరిగినతోడనే యాధాత్రీశునకు బ్రణమిల్లి వానియనుజ్ఞగైకొనిపోవ నొకరినొకరు త్రోసికొని ముందున కేతెంచు సామంతరాజుల గాత్రసంఘుట్టనమున వారికిరీటమాణిక్యములు నేలరాలి రత్నాకరతీరమున నలలతో దృళ్శిపడు రత్న సంచయముభాతి భాసిల్లెను. ఆయలజడిం దెగిన తదీయహారాద్యాభరణములనుండి పడిన ముత్యములు స్వాంత్యంభోధరవిముక్తజలబిందువుల కైవడి డంబుమీరెను. ఇటు నటు నటించు గుటిలాలక సమూహముల కింకిణీక్వణత్కార కలంకలంబనంగ నగరమున తరువాత లేచిన జనుల కోలాహలములీల జెలువొందెను. సమర్థవశమున విలాసినీజనము లాస్థానమణిస్తంభముల నూతగొనియుండ దదీయప్రతిబింబముల నెపమున నమ్మండ పశ్రీలు సమాలింగన మొనర్చి వారి నాదరించున ట్లొప్పెను.

ఇ ట్లతి వైభవమున నారాజమార్తాండుండు వేత్రహస్తు లిరు వేడల బరా బరులు సేయ వందిమాగధులు ముందు జయజయనినాద మొనరింప నాస్థానమండపము నుండి వెడలివచ్చి స్నానాది యధార్హ కృత్యములం దీర్చుకొని భుజించినపిదప లీలా తల్పమున విశ్రమించి సుహృజ్జనులతో నిష్టగోప్టి సలుపుచు మఱల జిలుకందెప్పించి దానితో నాదినము వినోదముగ గడపెను. ఇట్లే. ప్రతిదినమును చ్శి చిత్రశిఖుని సరసవచ నముల వినుచు నాభూమీశుండు సుఖమున గాలము బుచ్చుచుండెను.


327 వ మజిలీ

పుండరీకుని మృగవనవిహారము


మఱొక్కదినమున బుండరీక రాజేంద్రుడు విలాసమణిభపనమున మంత్రి సామంతపురోహితులతో నిష్టగోష్టివినోదముల బ్రొద్దుపుచ్చుచు గట్టెదుట మణిపంజర మందున్న చిత్రశిఖుని దరలితారవిందసఖములగు దృష్టులం దిలకించి యిట్లనియె సఖా ! బుద్ధి విశేషమున బరిహసితబృహసృతియనదగు నీవిభూతివర్ధనామాత్యుని ప్రజ్ఞా మూలమున నరాతివంశాకురములెల్ల బెకలింప బడినవి. సద్గుణ గణాకర్షి తంబై