పుట:కాశీమజిలీకథలు-12.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిలుకకథ

151

జెందియున్న నేను భయంకరంబైన పామర కరగ్రహాపదంబడితిని. పిమ్మట నెన్నడు నెరుంగని పంజరబంధమున దగల్కొంటిని. కాని దైవయోగమున పామరుడను యమ దూతవలన బట్టువడినను తుదకు భాగ్యవశమున నీ సమక్షమునకుగొనిరాబడితిని శారదీ ప్రముఖ వనదేవతాప్రకరము ప్రతిదినమును నే మానవ నాయకుని నాశీర్వదించుచుండ నే నాలకించి యుంటినో యట్టి రాజేంద్రు నన్యతుల్యాకృతిని దూరమునుండి చూచిన తోడనే నేను గ్రహింపగల్గితిని. ప్రమోదరసమిశ్రితమగు భవదీయదర్శనామృతము నాస్వాదించి నాయాత్మస్వస్థతం బొందినది.

ఆకాశమందు వాయుపథమున సంచరించు ననుబోంట్ల కిట్టి యసమక్లేశాను భవము బురాతనకర్మ పరిణామమున గాక యితరంబున నెట్లు గలుగును? సహజముగ‌ నీడజంబులు విశ్రంభశీలములు. అట్టిజాతిని బొడమినను నే నొకనికి పట్టువడి భూమీం ద్రుని వశమగుట విచిత్రముగదా! కావున నో రాజచంద్రమా! పురాకృత కర్మాను గుణముగ బవర్తించు నీలోకమున మంచిచెడ్డల కెందును నెవ్వడును గ ర్తగానేరడు.


గీ. ఆత్మయనుపదార్థంబు శుభాశుభాతి
    మయముగావున దానిని నియతిఁ దెచ్చి
    యంతరాతముల నెంత యణచిపెట్టి
    యున్నసుఖదుఃఖముల నందె యుండి గాంచు

కావుననే మదీయపురాకృత శుభకర్మపరిణామమూలమున నశేష నరలోక తిలకుండవై, వివేకచూడామణి వగు భవదీయదివ్యదర్శనలాభం బిపుడు నాకొనగూడ గలిగె నని‌ నతివిన్నాణముగా వచించి యూఱకుండెను.

ఆ పలుకల కా మహీజాని మిగుల ముదమందుచు నాచిలుక నుద్దేశించి యిట్లనియె. ఓహో శుకశ్రేష్ఠమా! స్వజాతిపక్షుల నెడబాసి, స్వేచ్ఛాసంచార నిరోధముగ పంజరబంధమునం బడి‌ యిష్ట పదార్థమునుగాక పరులిడిన యాహారమాత్రమునెగాంచి యేపతత్రి మాత్రమాత్రతం జెందకుండును? నీ వితరపక్షులవంటిదానవు గావు గదా? కేవలము నీవు పురాకృతదుష్కృతమువలననే పక్షిజాతి బుట్టితివి. అయినను సకల విజ్ఞానసంపదయందు మనుష్యులను, మరుత్తులనుగూడ నతిక్రమించు విన్నాణ మంది యుంటివి. కావుననే నీవింతవంత నందుచుంటివి. ఇక విచారింపకుము. నీకోర్కె లన్ని యును సమయానుసరణిని దీర్చి నీకు సుఖము జేకూర్పగలను. నాసమీపమునకు గొని వచ్చువఱకును బిడాలాదికమువలన నాపద గలుగుకుండ నీ పంజరనివాసమే సమంజస ముగా నుండునని యతిమృదుమధురభాషణముల నాఱేడు చిత్రసిఖుని చిత్తమును సంతోషాయత్తముగ నొనరించివసంతశీలున కా చిలుక నప్పగించి వాని కిట్లనియె.


పాలపుంగవా ! నీవీ చిత్రశిఖుని నుద్యానమణిమండపమున నుంచి ప్రతిదినమును

స్వయముగ నాహారపానీయములనొసంగి రక్షించుచుండును. వినోదకథాప్రసంగ