పుట:కాశీమజిలీకథలు-12.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

నా వయసుతోడనే దినదినాభివృద్ధిగఁ బెరుగుచుండెను. పింఛము పెరుగుచున్న కొలది నా యంతఃకరణమున స్వయంప్రబోధ ముదయింపసాగెను. సమస్త వస్తుతత్వోప నిర్ణయము నందును సర్వ శాస్త్రములందును వివిధాశుకావ్య ప్రకల్పనా విశేషమందును నానా పురాణ కధోపకీర్తనా బైదగ్ద్య మాధుర్యమునందును విభ్రమాలాపగోష్టియందును మనుష్యజ్ఞానముగల నాకు గ్రమమున నతి ప్రాగల్బ్యము జనించెను.

అట్టి నన్ను శారదాదేవి తిలకించి వత్సా ! ఇంక నీవు యధేచ్ఛగ విహరింప వచ్చును. మద్వచనః ప్రభావమున నీ కగమ్య విషయ ప్రచారమందును నరంధ్రసంధి స్థాన ప్రవేశమునకు నత్యంత సామర్థ్యము కలుగగలదని వరములిచ్చి చిత్రశిఖుడను మంచిపేరుపెట్టి స్వతంత్ర్య విహారమునకు నన్ను విడచి యంతర్హితురాలయ్యెను. అట్లు జాతి విలక్షణముగ బించము వహించియున్న నన్ను చూచిన‌ మాత్రముననే శతృత్వము వహించి యితర శుకశకుంత సంతతులు బ్రహరించుచుండ స్వజాతి సంగాత సౌఖ్యమెరుగక యేకాకినై నాడు మొదలు నేనావనాంతర మందున్న సర్వ వృక్ష కోటరాంతరముల నివసించుచు కాలమొకరీతి గడపుచుంటి. సకలతత్వ నిర్ణయం బొనర్పందందు వివేకము గల్గియున్న నన్ను క్షణమైనను స్వజాతి సుఖసంగమాభి లాష విడువదయ్యె. ఒకనాటీ ప్రాతఃకాలమున శరత్సమయ సంజాత సంతోషాతిరేక ముతో నంతరిక్షమున నెగురు చనతిసంకులముగ నెచ్చటికో బోవుచున్న చిలుకల పిండుంగాంచి దాని వెనువెంట గొంతదూరమరిగితిని. అందు ముందేగు చిలుకలు వెనుకకు దిరిగి నన్నుజూచి పట్టరాని యీశున నాపైబడి యుచ్చండచంచువుల కోటిచే బొడచి నన్ను జంప బ్రయత్నించుచుండ నతిభీతి బరువెత్తి సంధిరంధ్ర శూన్యమైన యా చైత్రగర్భమును శారరవప్రభావమున బ్రవేశించి ప్రాణముల దక్కించు కొంటిని‌. అట్లొనగూడిన మహాపదలవలన మిగుల వెతనొందుచు సమగ్ర గుణవిర్భావ మూలకమగు మదీయ శిఖోన్మేషముగూడ నాపదకు గారణమయ్యెగదా యని తలంచుచు నట్టి పద్యములందుండి పఠించితిని.

ఆ చైతగర్భముం బ్రవేశింపజాలక చిలుకపిండు నన్ను విడిచి యధేచ్ఛగ‌ బోయెను. వానివలన నా కట్టి బాధ కల్గినను వాని జూడకుండ నేనుండజాలక మిగుల వెతనందుచు నది యెంతదూరమందున్నదో చూడవలయునని బయటకేతెంచి యా చైత్యశిఖర మధిష్టించితిని. ఆ శుకసమాజము దృష్టిగోచరమగుటచే దిగులొంది అయ్యో! తిరుగ నా జాతిపక్షుల నెన్నడు జూడగల్గుదునో యని చింతించుచు క్రింద విమల మణిపీఠకుట్టిమప్రదేశమున ప్రతిఫలితమైన నా రూపమును దిలకించి మందబుద్ధినై నా జాతిచిలుక యొకటి యందు వ్రాలియున్నదని భ్రమసి తటాలున క్రిందకు గంతువైచి దాని ననుసరించి తిరుగుచుండ వసంతశీలుడు పట్టుకొనబోవ వానికి జిక్కక పారిపోతిని. ఆతండు నన్ను వెంటాడుచుండ గొంతదూరమరిగి యాకలిచే బాధపడుచు నొకవరి పొలమును సమీపించి యందు వరిగింజల గొరికి తినదివురుచు నాకలిపాటున వివశతం