పుట:కాశీమజిలీకథలు-12.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

గతమునకు వెరచుచు మనోవైకల్యంబు మొగముల గనుపింప నొకచోఁ జదికిలంబడి దీర్ఘ నిశ్వాసంబుల నిగుడించుచుండిరి.

నారదుండు మెల్లన వారి సన్నిధింజేరి ముకుందుని మందిరమున జరిగిన వృత్తాంతమెల్ల పూసగ్రుచ్చినట్లు వారికి విశదపరచెను. తమకు సంభవించిన శాప దోషము విధంబెల్ల నాలకించి మించిన విచారమున వారు హాహాకారములు సేయదొడం గిరి. ఆ దేవమౌనియును వారి నుచితవచనముల నూరడించుచు మరియు నిట్లనియె. పూజ్యులారా ! విధివిధానము ననుభవింపక యెంతవానికైన దీరదు. కాని శ్రీదేవి యిడిన శాపము చాలకుచ్చితముగా నుండెను. ఇదొక్కటియే నా మనమును వేధించు చున్నదని వారికా లక్ష్మీదేవిపై యీర్ష్య జనించునట్లు పలికి యూరకుండె.

అప్పుడు గౌతముడు క్రోధఘూర్ణితవదనుండై యేమేమి ! ! ఆ శ్రీదేవికి మే మంతచేతకాని వారముగా గాన్పించితిమి కాబోలును. ఆమె మిమ్ము తాపసులమని విభూతిరాయలమని జటావల్క లాజినులమని ముదుసళ్ళమని మరియు నెన్నో విధముల మునిపత్నుల సమక్షమందు మిగుల నధిక్షేపించిన పాపకారణంబున మముబోలు మునీంద్రుని మూలముననే పుత్రుంగాంచి యుపయశంబు గాంచుగాక యని ప్రతి శాపంబిడెను. అందులకు నారదుండు సంతసించుచు దేవేంద్రుడు జన్మాంతరమున నా శ్రీదేవికే తనయుడై జనియుంచి రూపాంతరంబున నీకు బరమాప్తుడై యుండగల వాడు. అని వెండియు నిట్లనియె. శ్రీదేవి మీ యిరువుర నరలోకమున బుట్టునట్లు శపించి యుండలేదు. కావున మీరు దేవలోకములయం దెచ్చుటనైన జన్మించవచ్చును. కాని మనుష్యలోకమున శాపమూలమున గష్టపరంపరలంబడు నింద్ర చంద్రులతో గొంతకాలము సహచరులై యుండుట మాత్ర‌ము తప్పదని పలికెను.

అప్పుడు బృహస్పతి భిన్నమతియై యౌరా! ఎంత విపత్తు సంభవించి నది ! శాపమూలమున నరలోకమందున్న పత్నులను మఱొకరికి, గూర్చుటయే మా పనియా ! అట్టి యవమానము మాకు గలుగకండునట్లాయిరువురురమణులు నర లోకమున గాక యధోలోకమున జన్మింతురుగాక యని యూరకుండెను. నారదుం డా మాటలకు మందస్మితం బొనరించుచు నార్యా ! శ్రీదేవి శాపం బమోఘంబు. అధో భువనమున బొడమినను దిరుగ నూర్ద్వలోకమున జన్మించినను వారి కింద్రచంద్రుల సంఘటనము నరలోకమున దప్పదుగదా ? యని వచించు నారదునను బృహస్పతి యిట్లనియె.

నారదా ! నీ మాటల మూలమున నా యిరువురు తరుణులు నధోలోకము నను నూర్ద్వలోకమునను గూడ జన్మింపవలెనని పొడనట్టుచున్నది. దైవవిధి దురతి క్రమణీయము. ఏది యెట్లు జరుగనున్నదో యట్లె యగుంగాక యూరక వగవనేమిటి