పుట:కాశీమజిలీకథలు-12.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంద్రచంద్రులశాపము కథ

135

గాక. వారి ననుసరించి వీరందునిలిచి లక్ష్మికి ప్రతిపక్షులై బలుకఁ దివురుట సహింహఁ దగినదికాదు. ఇట్టి యవినయప్రవర్తనులు దేవలోకమున నుండదగరు. అచిరకాలము ననే వారిరువురును నరలోకమునఁ గష్టపరంపరలం దగుల్కొని తమ యవజ్ఞతకుఁ దగినఫలం బనుభవించెదరుగాక యని యింద్రచంద్రుల శపించెను.

పరమేశ్వరుని సామేననొప్పియున్న యార్యాణియును నట్టి యుత్సవసమ యమున శ్రీదేవితోఁ గలహించి యమాయకులగు భర్తలకుఁ గళంకమాపాదించిన యహల్యాతారామణులను దేవలోక నివాసయోగ్యత లేకుండఁ బుడమిఁ బుట్టునట్లు శపిం చెను. విష్ణువక్షస్థలమున నొప్పియున్న శ్రీదేవి పార్వతీపరమేశ్వరుల శాపవాక్యము లాలకించి కించిచ్ఛ్మితాస్వభాస్వరయై యింద్రచంద్రుల కతమున నిట్టి దారుణశాపం బనుభవింపవలసివచ్చిన యా మచ్చకంటులకు శాపగ్రస్తులైయున్నను వారిరువుర సహ వాసము వెండియు లభింపఁజేసిన నీ పరమేశ్వరి శాపము వరంబై సంతోషముగూర్చుఁ గావున నట్లయగుంగాకయని యనుగ్రహించెను. మరియును భార్యల దుష్టప్రవర్త నంబు సైరించి వారిం బురస్కరించుకుని యెదిరితప్పెన్నుచున్న గౌతమ బృహస్ప తులు శాపకారణమున రూపాంతరములు వహించియున్న సతులకు మనప్రియులఁ గూర్చుటయందు సహాయులై మెలంగెదరుగాక యని యూరకుండెను.

ఇట్లు దారుణముగా, వారెల్లరును శపింపబడుటకా సభాసదులెల్లరును నిశ్చే తనులైరి. అప్పుడు నారాయణుండు ప్రశాంతవచనముల నిట్లనియె. ఎంతవారలకైన నొకప్పుడు ప్రమాదము సంభవించుట సహజము. ఈ శుభదివసమున నిచట జరుగు చున్న మహోత్సవమున కానందమున నేతెంచిన వారికిట్లు ప్రమాదము సంభవించుటకు నా మనం బొప్పకున్నది. పార్వతీ పరమేశ్వరులిడిన శాపమును శ్రీదేవి యాడిన మాటలను ద్రిప్పనెవరితరంబగును. రూపాంతరముల నింద్రచంద్రుల కహల్యాతారా పతులయందుఁ బుత్రోదయంబగువరకే యీ శాపదోషము నిలువఁగలదు. సంతానము గలిగిన యనుక్షణమందే వారెల్లఱకును శాపాంతమై యధాస్థితిఁ గలుగఁ గలదు. మరి యును చంద్రుడు లేకున్న నోషధులు వర్దిల్లజాలవు. దానఁ బ్రజాసంరక్షణమునకుఁ గొరంత వాటిల్లును. కావున నీ శాపఫలం బాకశానిధి యంశమాత్రమే యనుభవింప దగునని యనుగ్రహించెను. పిమ్మట నాయధోక్షజుండు నాటి యుత్సవములెల్ల నిలుపు జేయించి దేవతలను మహర్షులను వీడ్కొల్పి లక్ష్మీసమేతుండై యంతర్గృహమున కేగెను. పార్వతీపరమేశ్వరులు వృషభవాహనా రూఢులై కైలాసములకేగిరి. వాణీ హిరణ్యగర్భులును గందినడెందములతో మరాళ మందయానమున నిజమందిరమున కరిగిరి. తక్కిన సర్వబృందారకులును మునివృషభులును విన్ననగు మొగములతో నా సభామందిరము విడచి యదృచ్ఛాగతింబోయిరి. నారదుండు గౌతమబృహస్పతు లున్న విడిది కరిగెను. అప్పటికి వారించుక‌ శాంతచిత్తులై గతమునకు వగచుచు నా