పుట:కాశీమజిలీకథలు-12.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

లోపాముద్ర - అంబా ! కారడవుల నేయాకు టింటిలోనో కాపురముండి భర్తయే సర్వమనినమ్మి యాతని పాదముల గొల్చుచు నమాయకవృత్తి గాలముగడుపు చున్న మావంటి నిరుపేదలపై నీ కిట్టి యవ్యాజమైన యనురాగము గలుగుటకు మేము పూర్వభవమున నెట్టి పుణ్యమొనరించితమో యెరుంగము.

లక్ష్మి - నిఖిలదేవతా పురోహితుఁడగు వాచస్పతి సతియగు నీతామరణిరా దక్కదక్కి.న మునిపత్నులందరును భర్తలతో దపోవనముల దరచుగ గృశించుచున్న మాట నిక్కువమగును. కాని సాధ్వికి జీవితేశ్వరునితోడిదలోకమని నమ్మి యట్లుండుట చేతనే మిక్కిలి ప్రసిద్ధి గాంచగలిగిరి. స్వర్గమున గాపురముండి రాజభోగానుభవా నందఁబందినకతమున మీ యందరయందును దారయే మిగుల నదృష్టవంతురాలని యామెమొగము దిలకించుచు మందస్మితమున నర్మగర్మముగా వచించెను.

తార - [ఇంచుక మొగము జిట్లించుకొని] ఏమమ్మా ! నా భర్త ఇంద్రుడా యుపేంద్రుడా ! రాజభోగానుభవము నా కెట్లు కలుగును ! దేవతలకందరకును బురో హితమాత్రుండై వారి కనుసన్నల మెలగుచున్న వాని యిల్లాలిని‌ నన్ను మీ రిట్లవమాన పరచుట యొప్పిదమేనా ?

లక్ష్మి --- [చిరునవ్వుతో] తారాసతీమణీ ! యింతలోనే నీకింత యలుక గలుగవలయునా ? మునీశ్వరులు భార్యలకు హితము సేయుపొంటె యాత్మప్రభావ మున జంద్రుడైన గాగలరు, ఇంద్రుడైన గాగలరు.

అహల్య - [తనలో] ఇంద్రుని పేరుచ్చరించుచు నీ శ్రీదేవి నన్నుగూడ నెత్తిపొడుచుచున్నది గదా. [తారతో] సఖీ ! చూచితివా శ్రీదేవి సాహసము ! అజ్ఞాన మున నెన్నడో మనమిరువురము నింద్రచంద్రసహవాసం బొనరించిన నీ షద్దోషము నీమె యెట్లిచ్చట సూచించుచున్నదో గ్రహించితివా ? లేకున్న వారిరువుర నామముల నిందుహరింప బనియేమి ? సమానులలో నేడు మనకిచట తలవంపులు గలుగునట్లు బలుకుచున్న నీ యుదధికన్య నేమనవచ్చును ?

తార -- నేను మొదటినుండియు నీ లక్ష్మీచేష్టితముల గ్రహించుచునే యున్నాను. అనసూయా ప్రముఖుల నత్యంతము గౌరవించి మనమిరువురనీమె యించుక యుపేక్షించియండుట నీవు కనిపెట్టలేదా ? ఇట్టి తేలికబుద్ధి గలిగిన యీమెను బెద్దజేసి చూడవచ్చుట మనదే తప్పని తలంతును.

అహల్య - తక్కినవారి‌వలె మనముగూడ మోటుముస్తాబు వహించియుండక దివ్యభూషణభూషితులమై చెలగియుండుట కీమె యీర్ష్య వహించియున్నట్లు తోచు చున్నది. తనకన్న నెదుటివారు మనోహరరాకృతి నొప్పియుండుట కొందరికి గన్నె ఱ్ఱాగానుండు నందురు.

తార - నీవు చెప్పునది సత్యమే కావచ్చును. మొగమునిండ బస పింతదట్ట ముగా నలందుకొని నుదుట బట్టెడు కుంకుమబొట్టు బెట్టికొని చక్కగా దిద్ధబడ