పుట:కాశీమజిలీకథలు-12.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పుండరీకుని జన్మవృత్తాంతము కథ

127


    సంతులేకయున్న సర్వంబసహ్యంబ
    దెంతవానికైన నిది నిజంబు.

సంతానరహితుని భోగభాగ్యములు వ్యర్దంబులు. ఆ పుత్రకుని యానందము శూన్యగేహంబునందలి దీపకాంతి వంటిది. అనపత్యుని విద్యాబలములు ప్రయోజనరహి తములు. పిల్లలులేనివాని జీవనము నిరుపయోగము. అట్టి నిరర్దక ప్రాణధారణముకన్న జచ్చుటయే యుత్తమమని తలంచుచున్నాను. ఇట్టి దారుణ విచారమునకు లోనై సంత తము గృశించుచు నే డిందేతెంచితిని. ముల్లోకములకు నియామకుండవగు భవదీయ సందర్శనం బొనరించి నీ యానతిముందు కృత్యమునకు గడంగ నెంచితిని. మీద దేవరయే ప్రమాణము కా హృదయశల్యము నూడబెరుకుటకు మీరలే కర్తలని మిన్న కుండెను.

ఆ పలుకు లాలించి వాని యభిమతం బెరింగి కటకటంబడుచు నా సహ స్రాక్షుండు చేరువనున్న దేవగురుని మొగము దిలకించి యాచార్యవర్యా ! నా ప్రియ మిత్రుడగు నీ చిత్రరధుని హృదయ పరితాపకారణం బెరింగినదిగోలె నా డెందమున మిగుల జాలి బుట్టుచున్నది. ఆగతానాగతఫలముల శాస్త్రదృష్టి నెరింగి చెప్పుటయందు మీకుగల సామర్ద్యం బెవరికిని లేదు. ఈ గంధర్వపతి భాగదేయ మెట్లున్నదో పరీక్షించి యెన్నడైన వీనికీ సంతానయోగము గలదేమో తెలియజేయుడని పలుకుటయును నా బృహస్పతి కొంత సేపెద్దియో గుణించి భవిష్యమెరింగి యప్పాకశాసనున కిట్లనియె.

దేవతా చక్రవర్తీ ! ఈ గంధర్వశ్రేష్టుని దిష్టంబు సామాన్యముగాదు. చతుర్దశభువనములయందును వీనిబోలు పురుషప్రవరుండుండుట యబ్బురంబు. అలఘు గుణగణయుతుండై యఖండ సద్యశోవిరాజితుండై యనిర్వచనీయ శౌర్య సమేతుండై యనల్ప బలపరాక్రమ సమన్వితుండై యనన్య దుర్గభమహావైభవ ప్రశో తుండై నెగడు నీ చిత్రరధుడు సర్వవిధముల బ్రశంసనీయుడై యుండెను. కాని వీనికి పుత్రస్థానము మాత్రము మిగుల దుర్భలత నందియున్నది. వీనికి పుత్రసంతాన మెన్నడును గలుగనేరదు. అయినను గొంతకాలమున కొక పుత్రికా రత్నము మాత్రము వీనికి జన్మింపగలదు. అబ్బాలికామణి వలన సంభవమగు పురుష సంతానమే వీని వంశమున కాధారమై యుండునని యూరకుండెను. చిత్రరధుండు మొగమున దైన్యంబుదోప నీరెలుంగున నాచార్యునితో గురుప్రవరా ! నాకు పుత్రులు గలుగు భాగ్యములేకున్న నా తమ్ముడు హంసునకైన నెట్టి యోగమున్నదాయని ప్రశ్నించుటయును నా దేవగురుండు దిరుగ గొంతసేపు గణితము జూచి పురుష పుంగవా ! మీ యిరువురి భాగదేయము లొక్కరీతినే యొప్పియున్నవి. నీకుబలె హంసునకు గూడ నేకపుత్రికాయోగమేగాని కొడుకులు గలుగు సుకృతము లేదు మఱొక్క విశేషము గూడ గలదు. మీ యిరువురకును గూతుండ్రు కొంచె మించు