పుట:కాశీమజిలీకథలు-12.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

మిత్రమా! భవదీయదీనాననసమీక్షణమున మదీయ హృదయం బపరిమిత పరితాపమున గొందలమందుచుండెను. ఎన్నడులేని కలత నీకేమిటికి గల్గెనో గ్రహింప జాలకున్నాను. సహజధైర్యనిధానమగు నీడెందమున కెట్టియిక్కట్టు సంభవించెనో యూహింప శక్యముగాకున్నది నీ విచారకారణం బెరుంగుటకు నాహృదయం బాతత్రం బొందుచున్నది.


చ. గురులకు నెగ్గుసల్చితివొ ? కోరియగమ్యగమించితొ ? రణాం
    తరమున భీతీఁజెందితివొ ? దబ్బరలాడితివో ? యవధ్యులన్‌
    గరమువధించినావొ ? యుపకారిఁదలంపవొ ? యేయకార్యమిం
    కరయఁగ జేసియుంటివొ ? రయంబునఁబల్కుమ దైన్యమేటికిన్‌.

గీ. సుఖియె? నీసోదరుండు హసుండితండు
    కుశలమగునాక్కొ ? నీ బంధు కోటికెల్ల
    సేమమెగద ? గంధర్వ శేఖరులకు
    లేదుగా ? శత్రుబాధ మీ మీఁదనిపుడు.

ఇట్లు పఠించు బిడౌజునకేమి ప్రత్యుత్తరంబొసంగవలెనో యెరుంగక చిత్ర రధుండు మౌనము బూని యుండుటచే మరింత హృదయోద్వేగముం గాంచి యా శతమన్యుండు వెండియు నిట్లనియె. హితుడా! నీ వైఖరి నేడు తారుమారుగా నున్నది గదా? నీ దీనావనము దిలకింప నా డెందంబు గలత‌ బడుచున్నది. ఎన్నడును నీయం దిట్టి దైన్యము గనివిని యెరుంగను. నేడేమి గల్గెనో తెలియదయ్యెను. సత్వరము భవదీయ దుఃఖకారణ మెరింగింపుము. అందులకు దగిన ప్రతీకార మాలోచింతము. ఇంకను మౌనము వహించి యుంటినేని మిత్రద్రోహ మొనరించినవాడవగుదువు. చెలి కాడా ! నీ దేహమున నత్యంత బాధకంబగు రోగమెద్దియైన నుత్పన్నమై యుండలేదు గదా ?

అని యనేక విధముల నడుగుచున్నవానికి చిత్రరధుం డల్లననిట్లనియె.

త్రిలోకాధిపా ! నా దేహమున నెట్టి రోగమును లేదు. గంధర్వ లోకంబెల్ల గుశలముగా నున్నది. నా బంధువర్గము సుఖసమంచితమై యొప్పియుండెను. నా లోకమునందు శత్రుభీతియును లేదు. నీయనుగ్రహమున మాకేకొరంతయును లేదు. కాని నా సోదరుండగు హంసునకును నాకును నిరంతర మొక వినయము మనోవేదన గల్గించుచుండెను. సంతోషరహితస్వాంతములకు సౌఖ్యమను వస్తువు గగనకుసుమమే గదా !


ఆ. వె. ఎంత భాగ్యమున్న నెంత గౌరవమున్న
         నెంత విద్యయున్న ఏమియున్న