పుట:కాశీమజిలీకథలు-12.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పుండరీకుని జన్మవృత్తాంతము కథ

125

వలన జన్మించెను. ఒకకులంబు భూమివలన నావిర్భవించెను. ఒకటి జలంబువలన బుట్టెను. మన్మధునివలన నొక్కకులంబు గలిగెను. మృత్యువువలన నింకొక్కటి యుత్పన్నమయ్యెను. అమృతంబువలన మరొక్కటి జననమందెను. ఒకయచ్చర కులము సూర్యకిరణములవలనను నింకొక్కటి చంద్రకిరణముల వలనను బొడమెను. ఓకటి విద్యున్మాలయందు జనిమగాంచెను. దక్షకన్యకలైన ముని, యరిష్టలవలన నొక్కొక్కకులము బొడసూపెను. ఇవియన్నియుంగలిసి పదునాలుగు కులము లయ్యెను. గంధర్వులలో దక్షకన్యకాద్వయమువలన గలిగిన రెండుకులములే నిలిచి యుండెను.

అందు మునిపుత్రులు పదునార్వురతో గడగొట్టువాడు చిత్రరధుండు మిగుల బ్రఖ్యాతిగాంచెను. అతం డతిపరాక్రమోపేతుడై దేవదానవ సమరమున దేవత లకు బెక్కు సారులు మిగుల సహాయముజేసి యింద్రున కాంతరంగిక మిత్రుడై యుండెను. అరిష్టతనూజులార్వులలో జ్యేష్టుండు హంసుం డనువాడు. చంద్రకిరణ సంజాతాప్పర కులమున బొడమిన గౌరియను నతిలావణ్యవతిం బరిణయమై చెలంగి యుండెను. అమృతసంభవంబగు కులమున బుట్టిన మదిరయనుకన్యను చిత్ర రధుండు పెండ్లాడెను. అతండు బాల్యమందే గంధర్వులకెల్ల నేలికయై భారతవర్షమున కుత్తరదిశనున్న కింపురుష వర్షమందుగల హేమకూటపర్వతమున నివసించియుండెను. అం దాతనిచే బరిపాలింపబడుచు వేనవేలు గంధర్వులు కాపురముండిరి. మరియు జిత్రరధుండు హంసుని రెండవ గంధర్వకులమున కొడయనిగా నియమించుటంజేసి యతండుగూడ హేమకూటమందే యపరిమిత గంధర్వబలము సేవింప నివసించి యుండె. చిత్రరధునకు హంసునకు బరస్పరానురాగము దినదినాభివృద్ధి గాంచుచుండ బెద్దకాలము వారు రాజ్యపరిపాలనము సుఖమున జేయుచుండిరి. కాని వారికెంతకాలము నకును సంతానప్రాప్తి కలుగదయ్యెను. అక్కా.రణమున వారనవరతము జింతాకుల స్వాంతులై భోగవిలాసముల విరక్తులైయుండిరి.

చిత్రరధుం డొకనాడు మిత్రుండగు సచీకళత్రునకు దనమనస్సంకటం బెరిం గించి యపత్యలాభము బడయు నుపాయము దెలిసికొననెంచి మించిన తమకమున స్వర్గ లోకమునకరిగెను. అశతక్రతుండు సర్వబృందారకబృంద బరివేష్టితుండైసుధర్మామధ్య మున బేరోలగంబున్న సమయమున జిత్రరధుండు మందగమున నందేతెంచి హృదయ పరితాపంబు మొగంబున గనిపింప నిలించి వల్లభుని మ్రోల దలవాల్చి నిలచి యుండెను. ఆగంధర్వనాయకుంగాంచి సముచితగౌరవ పురస్సరంబు సురపతి యాదరించి యాసన్నార్హాననంబు నుపవిష్టునొనరించి స్నేహభావము దేటపడు రీతి నిట్లనియె.