పుట:కాశీమజిలీకథలు-12.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము


    లోకంబునకు వేగఁ గైకొనిపోయి యం
           దొనరఁ గాపాడఁ గారణముఁగలదె?
    వారికి పూర్వసంబంధ మెయ్యదియైన
           నుండెనా ? శ్వేతకేతుండు కునులఁ

గీ. జడఁగ శ్రీదేవిమోహ విభ్రాంతయై సు
    తుంగని చెలంగి మౌనికొసంగిపోవు
    టరయ నత్యద్భుతంపు కార్యంబుగాదె !
    హేతువెయ్యది దీనికి యెరుఁగఁజెపుమ,

శా. చంద్రాపీడుని యంతమున్గని తదశ్వశ్రేష్టముం గొంచుని
     సంద్రత్వంబున దివ్యపుష్కరిణి మధ్యంబందు బడ్డట్టియా
     చంద్రోద్యన్ముఖి పత్రలేఖయను యోషారత్న మేమాయెనో
     సాంద్రానుగ్రహ మొప్పనా కిపుడు భాస్వద్రీతిమై జెప్పరే?

గీ. శాపము దొలంగగాఁ గపింజలుఁడు సరసి
    వెడలివచ్చినవిధము సవిస్తరంబు
    గాఁదెలిసెఁగాని పత్రలేఖావధూటి
    వార్త తెలియదయ్యెను గురుప్రవర ! పిదప.

ఆ. వె. పత్రలేఖిపూర్వభవ మందునెవ్వతె ?
         కారణాంతరంబు కతననామె
         జన్మమెత్తినటు చర్చింతు నెమ్మది
         సత్యమెరుఁగఁజెప్పు స్వామి ! నాకు.

క. ఏతత్క థాచమత్కృతిఁ
    జేతఃపరవశతఁ గాంచి చెలగెడి నాకీ
    రీనిని సందేహములపు
    డాతతగతిఁదోపవయ్యె నయ్య ? యడుగఁగాన్‌.

మ. అతికౌతూహలమొప నిట్లడుగు శిష్యశ్రేష్టు బుద్దిప్రవీ
     ణతకెంతే మణిసిద్ధయోగి హృదయానందంబునుం బొంది స
     న్నుతమాణీక్యమహాప్రభావగరిమన్‌ బూర్వాద్భుతోదంతమం
     చితరీతిన్‌ గ్రహించి సర్వమెరిఁగించెన్‌ వానికీతీరునన్‌.

గోపా ! వినుము. స్వర్గంబున బ్రసిద్దమగు నచ్చరల కులంబులు పదు నాలుగుగలవు. అందొకటి పద్మగర్భునివలన నుద్భువించెను. మఱొక్కటి వేదముల వలన నుదయించెను. ఇంకొక్కటి యగ్నివలన సంభవించెను. వేఱొక్కటి వాయువు