పుట:కాశీమజిలీకథలు-12.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము


    గూతులిద్దరు నీకుఁ గొడుకులిద్దరు నీకు
           నని మోముసూచి సత్యంబునుడువు
    దాతగారనువావిఁ దనవారితన మొప్పు
           గురును మోపకయుండ సరసమాడు

గీ. వ్రతమునోమించు దివసవారములు దెలుపు
    ననుగలంబై భామినీజనులయెడను
    గుండుబొజ్జయు శిఖయును గురచపొడవు
    వ్రేలిదర్భాంకురము నొప్ప విఘ్నరాజు.

ఇవ్విధమున నానా ప్రకారముల సంచరించుచు నరిష్టం బనతి కాలముననే కాశీపట్టణమునకు సంభవింపఁగలదనువార్త యెల్లరకుఁ దెలుపుచుఁ బౌరుల భీతావహులం జేయుచు హితుండునుబోలెఁ జరించుచు సర్వజనులచే సంస్తుతింపబడుచు డుంఠిభట్టార కుండను నామమున మెలంగుచు నొకనాఁడు రాజదర్శనం బొనరించి యతం డడిగిన ప్రశ్నలకు సదుత్తరములొసఁగి మెప్పువడసి యతని పురోహితులలో నొక్కండై ప్రవర్తించుచుండెను. మరియొకనాఁడు రాజు వాని ‌జూచి యిట్లనియె.


గీ. చెప్పుమా డుంఠిబట్ట ! కాశీపురమునఁ
    బుట్టుచున్నవి యుత్పాతములు దరుచుగఁ
    గారణంబెద్దిదీనికి ? కలుషమెట్లు
    వాటిలెనొ ? ధర్మమేవంకఁ బల్లటిలెనొ ?

అట్టి రాజ ప్రశ్నమునకు జేతులు జోడించుకొని డుంఠి వినయ వినమిత గాత్రుఁడై యిట్లనియె. రాజచూడామణీ ! అప్రియము బలుకుటకు నోరాడకున్నది. ఈ యుత్పాతములవలన నిప్పురమునకు బెన్ముప్పురానై యున్నది. అయినను మదీయ మంత్రబలమున నీ యనర్దములకెల్ల నుపశాంతి యొనర్పగలవాడను. కాని నీవిందుం డుట యుచితముగాదు. నీకు కీడ గలుగుటకు మేము సహింపజాలము. కావున నీవు కొంత కాలము రాజ్యము విడచి యెందేని బోవుట శ్రేయస్కరమగును. ఆత్మార్థం పృధివీంత్యజేత్త అనెడు వాక్య మిందులకుఁ దార్కాణముగా నున్నది. అయినను బెద్దల నింకను విచారించి వారి యాదేశము వడువున నొనరింపుము. త్రికాలజ్ఞుండగు బ్రాహ్మణుం డొక్కరుం డుత్తర దేశమునుండి నేటికిసూటిగా బదునెనిమిదివనాటి కేతెంచి నీకు హితోపదేశము సేయంగలడని చెప్పి యప్పార్ధివేంద్రుని డెందమున కెన్నడు నెరుంగని భయమును గల్పించెను.

పిమ్మట నరవిందాక్షుండుగూడ శంకరుని యభిమతము పొంది కాశికేతెంచి గంగావరణాసంగమమున బాదప్రక్షాళనం బొనరించిన కారణమున నా ప్రదేశము