పుట:కాశీమజిలీకథలు-12.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

మొగంబుపైఁ జూడ్కులు బరగించుచు గించిచ్చి తాస్వభాస్వరుండై తలపంకించుచు దివోదాసుండు వానితో నిట్లనియె.


మ. తెలిసెన్ బో ! యిఁకదాపనేమిటికి నీతీరిందునాముందు ని
     ర్మలచిత్తుండగు రత్నచూడుఁడు మహాప్రాజ్ఞుండు విజ్ఞుండు నా
     చెలికాఁడొక్కఁడుదక్క నాకిరులవాసిన్‌ మేలుగూర్పంగ న
     న్యులు సంసిద్దులుకాఁగలరె? నిజమోహో ! నాకుఁగన్పట్టెడిన్.

అని యా పరివ్రాజిక వేషధారియైన రత్నచూడుని దెలిసికొని వానిననేక విధంబుల నభినుతించెను. రత్నచూడుఁడును బూర్వపురూపంబు వహించి యా రాజేంద్రుని ముందు నిలువంబడి మహాప్రభావసంపన్నుఁడవగు నీయెదుర నామాయా వేషములు బనికివచ్చునా యని మందహాస మొనరించుచు వచించెసు. పిమ్మట దివో దాసునితోఁ దన పాతాళలోక యాత్రావృత్తాంత మెల్ల వర్ణించి యనంగమోహిని క్షేమమెరింగించి వానిమనంబున కానందంబొనగూర్చెను. పిమ్మట గార్తాంతికు లెరిం గించిన శుభముహూర్తంబున రత్నచూడుఁడు మార్గదర్శకుఁడై ముందునడువ కతిపయ పరివారసమేతముగా రసాతలంబునకేగి మహావైభవంబున ననంగమోహినిం బరిణయ మయ్యెను. ఆ వివాహామునకు సప్తపాతాళలోకములంగల బెద్దలందఱు నరుదెంచి వధూ వరుల నాశీర్వదించిరి. పిమ్మట నమ్మహారాజు రసాతలమున ననంగమోహినితో నిష్టోప భోగముల ననుభవించుచు గొంతకాలముండి యనంతరము నిజలోకమున కరుగుటకు వాసుకి యనుమతము వడసి యనంగమోహినిం దోడ్కొని యఖండ వైభవమున వారణాశి కేతెంచెను.

ఆ సమయమునకే యక్షలోకమునుండి మణిగ్రీవ జలంధరులు గుణవతిం దోడ్కొని దివ్వయానమున గాశీనగరమున కేతెంచి తమ రాక ఱేనికెరింగించిరి. అమ్మహా రాజ మందానందకందళిత హృదయారవిందుడై యనంగ మోహిని కాయుదంతబెరిం గించియప్పుడే వారి నెల్లర రప్పించి గుణవతిని నంతఃపురమునకు బంపి మణిగ్రీవజలం ధరుల బెద్దగా గౌరవించెను. అనంగమోహినిని బట్టమహిషిగా స్వీకరించి యమ్మహా రాజు గుణవతింద్వితీయ గాంధర్వవిధిం బరిగ్రహించెను. పిమ్మట దేవకాంతలను గూడ గరిష్టభార్యలుగ గైకొనెను. హిమశైలంబున శాంభవీదేవి యాలయమందున్న రత్న రాసులకును హేమసౌధమునందలి మహాభాగ్యమునకు దివోదాసుడే నాయకుడై యఖండ వైభవములనుభవింపుచుండెను. ఆ రాజశేఖరుని యనుమతమున మణిగ్రీవ జలంధరులు గొన్ని దినములందేయుండి పిమ్మట నిజనివాసమున కరిగిరి. అరిందముండు దివో దాసుని విడచి నిజలోకమునకరుగలేక భూలోకముననే యుండి యా రాజేంద్రుని