పుట:కాశీమజిలీకథలు-12.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దివోదాసుని కథ

111

రాజేంద్రుడు వాని కొసంగెను. అందున్న వా రెల్లరును వాని యుపకారబుద్ధి ననేక విధముల బ్రస్తుతింప దొడంగిరి. శబరు లెల్లరును ఱేని యనుమతము వడసి శబరబాల కుని దోడ్కొని‌ నిజ నివాసము కరిగిరి.

తదనంతరము గొన్ని దినముల కొకపరివ్రావాజకుం డా రాజచంద్రుని సన్నిధి కేతెంచి మందహాస భాసురవదన సరోజుండగుచు నొకయుత్తరము నిజోత్త రీయమునుండి పైకిదీసి వాని కందిచ్చెను. దివోదాసుడు ససంభ్రమముగా నా లేఖ విప్పి యిట్లని చదువసాగెను.


సీ. శ్రీమన్మహారాజ సేవితపాదప
            ద్మునకు దివోదాసభూమిపతికి
    వాసుకియను నాగవంశోత్తముఁడు వ్రాయు
            వినయపూర్వకమైన వినతిపత్ర
    మిది మానవేంద్ర ! మీవృత్తాంతమంతయు
            రత్నచూడుండు సర్వంబు మాకు
    జెప్పఁగావిని సంతసించితి మెంతయు
            నాగులకిపుడీ వొనర్చినట్టి

గీ. గౌరవంబునకెల్ల నిక్కంబుగాఁ గృ
   తజ్ఞులము మేము దీనికెంతయును బ్రతిగ
   నీయనెంచితిఁ బత్నిగా నాయనంగ
   మోహినీపుత్రికను నీకు భూపవర్య.

చ. నినువిడనాడుటే మొదలు నిత్యము డెందమునన్‌ గృశించుచుం
    డెను నిముసంబదేయుగము రేవనుబుచ్చుచు నాయనంగమో
    హిని హితమెంచి నీవిచటికేడ్తెరవచ్చి పరిగ్రహింపు మో
    యనఘ! విలంబమింకఁ దగదయ్య ! వచింపఁగ నేలఁబెక్కిటన్‌.

శా. ఈలేఖంగొనివచ్చినట్టి యతఁడేయిందందు ముఖ్యుండగున్‌
     వాలాయంబుగమిమ్ము నాగభువనప్రాంతమునన్‌ జేర్పఁగా
     వీలౌమార్గము జూపగాఁగలఁడు సంప్రీతిన్ హితామాత్యభృ
     త్యాళిన్‌ దోడ్కొనితర్లి రాఁదగును నుద్వాహార్థమై వేగమే.

ఇట్లు,

భవదీయశ్రేయోభిలాషి,

వాసుకి.

అనియున్న యుత్తరమును మాటిమాటికిఁ జదువుచు దానిం దెచ్చిన వాని