పుట:కాశీమజిలీకథలు-12.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాతాళేశ్వరి కథ

109

దివోదాస పార్దివేంద్రా ! అనంగమోహిని నాఁటనుండియును బితృగృహ మున నుండెను. ఆమత్తకాశిని చిత్తంబు భవదాయత్తమై యుండుటచేత నాహార విహా రముల నయిష్టము సూపుచుఁ గృశించుచుండెను. ఆ సాధ్వీలలామకు నీవతి శీఘ్రమునఁ గనంబడకున్న నామె యాపదలపాలగుట నిక్కము. నీ వనుమతించిన నేనిప్పుడే నాగ లోకమునకేగి వాసుకితో నీయుదంతం బెరింగించి తగినట్లొనరించెదనని పలుకుచున్న రత్నచూడునితో నమ్మహారాజిట్లనియె.

దివోదాసునికథ

మిత్రమా ! నీయుపకారబుద్ధి కేనెంతయును సంతసించుచుంటిని. శబర బాలకుండు సజీవుఁడై నా సమీపమున నుండుటచే నేనింక నరణ్యములం దిరుగఁబని లేదు. నే నొనర్చిన ప్రతిజ్ఞ వడువున వీనిని దోడ్కొనిపోయి యాప్తుల కప్పగించి తిరుగ వారణాసికరిగి రాజ్యరమాలలామం జేపట్టుట యొప్పిదంబగును. అనంగ మోహిని నిమిత్తమున నాగులకెల్లరకు నేఁటినుండియును భూలోక ప్రవేశమున కనుమతి యొసంగుచున్నవాఁడను. కావున నీవతిరయమున నాగలోకమునకేగి నా యాదేశము వాసుకి ప్రముఖ రసాతలవాసులకెల్ల నెరెంగించి రమ్ము, అనంగమోహినికి నాక్షేమం బెరింగించి యామె యభిమతము గూడఁ దెలిసికొనిరమ్ము. ఇదియే నాకు నీవొనరింపం దగిన యుపకారమని పలుకుటయును రత్నచూడుఁ డందులకుఁ సమ్మతించి యప్పుడే నిజస్వరూపము ధరించి చేరువనున్న భూనివశంబులో దూరి మాయమయ్యెను. అందుల కందున్న వారెల్ల నబ్బురమందుచున్న సమయమున దేవకాంతలు నల్వురును నచ్చటి కేతెంచి యందున్న దివోదాసుని గాంచి మించిన యానందమున వాని సన్నిధిఁజేరి వాని యెడబాటువలన దమకు గలిగిన పరితాపంబెల్ల దెలుపసాగిరి. ఆ కాంతామణుల విడచి తానరిగిన పిమ్మట జరగిన వృత్తాంత మెల్ల దెలుపుచు వారి నుచితిరీతి నా రాజేం ద్రుం డాదరించెను. పిమ్మట నరిందము నీక్షించి యమ్మేదినీ వల్లంభుం డిట్లనియె.

మిత్రమా ! తుంబురు శాపంబు మూలమున నీ యప్సరో భామినులకు స్వర్గలోక ప్రవేశార్హ త లేకపోయినది. ఇయ్యది వీరలకెట్లున్నను నాకుఁ బ్రమోదావహం బయ్యెను. వీరిందోడ్కొని యిఁక వారణాశికిం బోవుట యుచితముగదా ? ఈ శబర బాలకుని గూడ మనము తీసికొనిపోయి వీనియాప్తుల నచటికే పిలిపించి నారి కప్పగిం