పుట:ఈశానసంహిత.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాగేశ్వరునియాలయంబున శివరాత్రినాఁడు శివపూజాదు లాలోకించి విధూతకల్మషుండైనట్లు గలదు.

సుకుమారుని మరణానంతరము యము నానతిని యమకింకరు లేతెంచి వాని లింగశరీరము బంధించి కొనిపోవుచుండ శివదూతలు శివాజ్ఞాచోదితులై వచ్చి వారి నాఁపి యుద్ధమున జయించినట్లు చెప్పఁబడిననిదప “అత్రగ్రంథపాతః” అని సంహితయందుఁ గలదు. మాహాత్మ్యమునందు శివదూతలు యమకింకరులు సంకులసమరము గావించుతఱి నొకయమభటుఁడు యమునికడ కేగి యుధ్ధవృత్తాంతము విన్నవింప నాతఁడు లుంబరుఁడను సేనానిని పెక్కుసైన్యములను నూఱుమృత్యువులను శివగణములపైకిఁ బంపినట్లును వారెల్లరును బ్రమథులచే భంగపడినట్లును వర్ణింపబడి "భటులు ప్రమథులచే నట్లు భంగపడినఁ జిన్నబోయి యముం డేమి చేసె చెపుమ” అను మునుల ప్రశ్నముతో నాశ్వాసము ముగియుచున్నది. అంతతోనే గ్రంథముకూడ సమాప్తమైపోయినది. తద్గ్రంథద్వయమునకును భేదములు సంహితయందు 73 అధ్యాయమున శివదూతలచేఁ దనభటులు పరాజయమొందుటయు పాపియగు సుకుమారుఁడు శివసాయుజ్య మొందుటయు జూచి, విస్మయావిష్టుఁడును భీతచిత్తుఁడునై శివలోకంబున కరిగి శివుని దర్శించి తనకు గలిగిన పరాభవము విన్నవించుటయు శివుఁడు శివరాత్రివ్రతప్రభావంబున సుకుమారుఁడు గతకల్మషుఁ డయ్యెనని చెప్పి యమునకు శివరాత్రివ్రతవిధానము సవిస్తరముగ వర్ణించి చెప్పెను. అంత సంతుష్టహృదయుఁడై యముఁడు తనపురంబునకు తిరిగిపోయెను. అను గ్రంథము అధికముగాఁ గలదు. అంతతో 73 అధ్యాయమును (బహుశః) సంహితయుఁగూడ ముగిసినవి.

విశేషములు

మన కింతవఱకు నుపలబ్ధములగు నేకైకశిథిలాతిశిథిలములగు నీప్రతులు రెంటివలననే శివరాత్రిమాహాత్మ్యసమగ్రతాసమగ్రతలు నిర్ణయించుకొనవలసి యున్నది. పీఠికలో శ్రీనాథుఁడు నాల్గాశ్వాస