పుట:ఈశానసంహిత.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బపహరించుచుఁ గొంతకాలము తనదుష్కార్యము బయల్పడకుండనే యున్నట్లు మాహాత్మ్యమునను గలదు.

హూణమండలమందే యాతఁ డాచండాలియందుఁ బంచపాతకసన్నిభులగు సుతులను సుతాద్వయంబునుం బడసి యామాలెత కాలగతి నొందిన పిదపఁ దనచిన్నికూఁతుల నేరమెంచుదు నిరువురు కొమరులం గని యొకనాఁడు రాజుచేఁ బహుధన మంది వచ్చువిప్రుల నూర్వురఁ బరిసూర్చి వారిధన మపహరించి తద్వార్తాశ్రవణమునఁ గుపితుండైన రాజుచేఁ దన్నుఁ చంపుటకు దూతలు పంపఁబడిరని తెలిసి కూఁతు నొక్కతెను దోడుకొని కిరాతదేశమునకుఁ బలాయనమై యొక్కశివరాత్రినాఁడు శివపూజాదు లాలోకించి విగతపాపుఁ డైనట్లు సంహితయందుఁ గలదు.

హూణమండలమున నతనిదుర్వ్యాపారంబులు ప్రకటంబగుటయు నట వసింప నోడి, యాతఁడు చండాలితోఁ గూడి హూణమండలము విడిచిపోయి తదనంతరము సుతులను నిరువురు సుతలను గనినట్లును చండాలీమరణానంతరము తనయ లిరువుర రమించుచు నిరువురుకొడుకులం బడిసినట్లును మాహాత్మ్యమునఁ గలదు.

మహాపాతకియగు వీనిసంసర్గదోషమునకు హూణమండలవిప్రు లుత్తప్తకృఛ్రచాంద్రాయణవ్రతాదిప్రాయశ్చిత్తము లాచరించినట్లు మాహాత్మ్యమునఁ గలదు. సంహితయం దీవృత్తాంతమే లేదు.

హూణమండలము విడచి సుకుమారుడు కిరాతదేశమున కేఁగినట్లును, అట వణిక్పదమున కనతిదూరమున నాగేశాహ్వయుఁడగు శివుని' యాలయంబున శివరాత్రివ్రతాదుల నాలోకించినట్లును సంహితయందుఁ గలదు. మాహాత్మ్యమున దుర్గమాటవీవిషమంబు హూణమండలంబు గడిచి యెడనెడ (కొంతగ్రంథపాతము) వణిక్పదమునకు గప్యూతిమాత్రదూరమున ఆదిమధ్యంబు (ధ్యాంత) నాగేశ్వరాహ్వయంబగు పుణ్యక్షేత్రంబున శేషప్రతిష్టితుండై యనేకకల్పంబులనుండి వెలసియున్న