పుట:అభినయదర్పణము.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పార్వతీహస్తలక్షణము

గీ.

చెలువుగను నర్ధచంద్రపుఁజేతియందుఁ
బరఁగ వరదాభయంబులు వట్టియున్నఁ
బార్వతీహస్తమై చాల బాగు మీఱు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

49

వినాయకహస్తలక్షణము

గీ.

మఱి కపిత్థంబులును రెండుఁ గరములందు
నుదరమున కెదురుగఁ బట్ట నొప్పుగాను
నిల వినాయకహస్తమై యేపు మీఱు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

50

షణ్ముఖహస్తలక్షణము

గీ.

[1]సొరిది వామకరంబు ద్రిశూలమును
జేరి దక్షిణహస్తంబు శిఖరమునను
నరసి పట్టిన షణ్ముఖహస్త మగును
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

51


గీ.

పొదల నర్ధపతాకంబు భుజము కెగువ
రెండుకరములఁ బట్టిన మెండుగాను
గార్తికేయునిహస్తమై ఘనత కెక్కు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

52

మన్మథహస్తలక్షణము

గీ.

శిఖరమును వామకరమునుఁ జెన్నుమీఱ
దనరు కటకాముఖంబును దక్షిణంపుఁ
గరమునను బట్ట మదనునికరము గ్రూర
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

53
  1. ఈలక్షణమే సం. అభినయదర్పణమునను గలదు. “వామేకరే త్రిశూలంచ, శిఖరం దక్షిణేకరే| ఊర్ధ్వం గతే షణ్ముఖస్య కర ఇత్యుచ్యతే బుధైః“ (అభి 590)