పుట:అభినయదర్పణము.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కర్తరీస్వస్తికహస్తలక్షణము

చ.

సరగను గర్తరీముఖము సారెకు రెండుకరంబులందునన్
మఱి మణిబంధమందు నదె మాటికి మన్ననతోడఁ జేర్చి తా
విరళముగాను బట్ట నది వేమఱు గర్తరిస్వస్తికం బనన్
మురహరి! ధాత్రిలో వెలయు, మోహన! కస్తురిరంగనాయకా!

9

వినియోగము

గీ.

పక్షులకుఁ దారలకు మఱి వృక్షములకు
మొనసి పర్వతములకు సమూహములకు
సారె కిటు సెల్లుఁ గర్తరీస్వస్తికంబు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

10

డోలాహస్తలక్షణము[1]

గీ.

తొడరి సపతాకహస్తంబు నడుమునందు
రెండుకరములఁ బట్టిన మెండుగాను
డోలహస్తం బనంబడు మేలు దనర
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

11

వినియోగము

క.

అల [2]పేరణికిని గడుసై
మెలఁగిననాట్యంబునకును మేదినిలోనం
జెలఁగును డోలాహస్తము
గలుషాపహ! దనుజభంగ! కస్తురిరంగా!

12

కపోతహస్తలక్షణము

గీ.

చేతు లటు కట్టుకొనను గపోత మౌను
సరగ భక్తిని గేశవు సన్నుతింపఁ
బొంకముగఁ జెల్లు మఱియు గపోత మిపుడు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

13
  1. “పతాకావూరుదేశస్థౌ డోలాహస్తాఽయ ముచ్యతే” అని లక్షణాంతరమును దీనికిఁ గలదు.
  2. పేరణి – భాండముమీఁదఁ జరపునృత్యము