పుట:అభినయదర్పణము.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

త్రిశూలహస్తవినియోగము

క.

ఎలమిని ముల్లోకములకుఁ
బలుమఱు మూటికిని బిల్వపత్రంబునకున్
వెలయఁ ద్రిశూలంబునకును
గలిగెఁ ద్రిశూలంబు ధరను గస్తురిరంగా!

58


మాలిని.

సరసిజదళనేత్రా! సజ్జనస్తోత్రపాత్రా!
హరిహయనుతపాదా! యచ్యుతా! లోకనాథా!
కలికలుషవిదారా! కామినీచిత్తచోరా!
పరహృదయవిదారా! పాహి శ్రీరంగశౌరీ!

59

గద్యము
ఇది శ్రీవాసుదేవకరుణాకటాక్షవీక్షణాకలితశృంగారరసప్రధానసంగీతసాహిత్యభరతశాస్త్రవిద్యాపారంగత శ్రీమద్యాజ్ఞ
వల్క్యాచార్యపదారవిందమరందబిందుసందోహపానతుందిలమిళిందీభూతనిజాంతరంగ
శ్రీమృత్యుంజయార్యపుత్ర కాశ్యపగోత్రపవిత్ర సుజనవిధేయ లింగముగుంట
మాతృభూతనామధేయ ప్రణీతం బయిన యభినయదర్పణం బను
మహాప్రబంధమునందు నసంయుతాఖ్యాష్టా వింశతి
హస్తంబులను బరుగుచున్నయది
ద్వితీయాశ్వాసము60