పుట:అభినయదర్పణము.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దామర మొగ్గకుఁదగవుగా [1]నై దన
              శాకపాకములను జెలఁగి యిడను
గదళిపుష్పమునకుఁ గలువల మొగ్గకు
              మెచ్చి ధనము చాల నిచ్చుటకును


గీ.

బ్రేమ మీఱఁగ ముద్దులు వెట్టుటకును
దగవుగా నిన్ని తావులఁ దనరుచుండు
ముకుళహస్తంబు నిలలోన, మోహనాంగి
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

54

తామ్రచూడహస్తలక్షణము

గీ.

అనువు మీఱఁగ ముకుళహస్తంబునందుఁ
దర్జనిక వ్రేలు వంచినఁ దగవుగాను
దామ్రచూడం బటంచనఁ దనరుచుండు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

55

తామ్రచూడహస్తవినియోగము

గీ.

ఒనర వాయసమునకును నొంటె కమరుఁ
గుక్కుటము మూషికంబును గొంగ యనను
జెల్లు నిదె తామ్రచూడంబు చెలువు మీఱ
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

56

త్రిశూలహస్తలక్షణము

క.

పరువడిఁ జిటికెన వ్రేలును
గుఱుచగ నంగుష్ఠ మెలమిఁ గూర్చుక మిగులన్
మఱి మూడువ్రేళ్ళు సాఁచిన
గరిమఁ ద్రిశూలంబు నయ్యె గస్తురిరంగా!

57
  1. “ఆత్మని ప్రాణనిర్తేశే పఞ్చసఙ్ఖ్యానిరూపణే” (అభి)