పుట:అభినయదర్పణము.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సందంశహస్తలక్షణము

గీ.

ఎలమిఁ దర్జనిమధ్యమములను జేర్చి
గరిమ నంగుష్ఠమునఁ గూర్చి కడమవ్రేళ్ళు
సాఁచినది సందంశం బని జగతి వెలయు
రాక్షసవిహార! కస్తురిరంగధామ!

51

సందంశహస్తవినియోగము

సీ.

చేరి ముత్యములకు వారిబిందువులకుఁ
              గొమరొప్ప రుద్రాక్షగుళికలకును
గరిమ మల్లెలకును గర్పూరమునకును
              మఱి పగడములకు మాత్రలకును
సొమ్ము వెట్టుటకును సొరది వాసనచూడ
              హవనంబులకు దేవతార్చనలకు
వైఢూర్యమునకును బరఁగఁ గెంపులకును
              ముద్రవేయుటకును ముదము మీఱ


గీ.

నొనరఁ జెలియలు మడుపుల నొసఁగుటకును
నరయ సందంశహస్తంబు ననువుగాను
నిన్ని తావుల వర్తించి చెన్ను మీఱు
రాక్షసవిహార! కస్తురిరంగధామ!

52

ముకుళహస్తలక్షణము

గీ.

ఒనరఁగా నైదుఁవ్రేళ్ళను నొకటిగాను
గూర్చినంతనె ముకుళ మై గొమరుమీఱు
సరసగుణహార! శ్రీరంగపురవిహార!
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

53

ముకుళహస్తవినియోగము

సీ.

పరఁగ దానములకుఁ బ్రాణంబు లనుటకు
              వేమాఱు సొలపున విరహమునకుఁ
బరువడి మదనుని పంచబాణములకు
              మఱి భోజనమునకు మౌనమునకుఁ