పుట:అభినయదర్పణము.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జొన్నకాయలకును బొడ్డుమల్లెలకును
              గుండలంబులఁ జూప మెండుగాను
జిన్నిగిన్నెలకును సున్నపుఁగాయకు
              సొరిది సుగంధంబు సూపుటకును


గీ.

మెఱయు మఱి యిన్నితావుల గరిమ మీఱి
యిలను లాంగూలహస్తంబు నిందిరేశ!
సరసగుణహార! శ్రీరంగపురవిహార!
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

40

[1]పద్మకోశహస్తలక్షణము

.

వెలయ మఱి యైదు వ్రేళ్ళును విరళములుగఁ
బట్టి మేలుగ వంచిన దిట్టముగను
బద్మకోశంబు సుమ్మది పద్మనాభ!
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

41

పద్మకోశహస్తవినియోగము

సీ.

చక్రవాకములకుఁ జాతకంబులకును
              గొమరొప్ప గుంటకుఁ గొప్పునకును
వెలఁగపండ్లకు నింక వెలఁదిపాలిండ్లకుఁ
              బండ్లకు గజనిమ్మపండ్ల కమరు
పూర్ణచంద్రునికిని బురికిని మేడకు
              సొగసుకు నెమ్మోముఁ జూపుటకును
దామరపూలకుఁ దనరుపట్నమునకు
              దేవళంబులకును దేరులకును


గీ.

జెలఁగఁ [2]గలగలశబ్దంబుఁ దెలుపుటకును
మంచిసౌందర్యమునకు శ్లాఘించుటకును
బద్మకోశంబు వచ్చును బాగుమీఱ
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

42
  1. దీనినే “సోలపద్మహస్తము”నుగాను వ్యవహరింతురు. “కనిష్ఠాద్యావర్తితాశ్చే ద్విరళా స్సోలపద్మకః” (అభి 355)
  2. “.......... తటాకే శకటే చక్రవాకే కలకలారవే| శ్లాఘనే సోలపద్మశ్చకీర్తితో భరతాగమే||” (అభి 357)