పుట:అభినయదర్పణము.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్పశీర్షహస్తవినియోగము

సీ.

[1]చందనంబునకును సర్పంబునకు మఱి
              మెల్లగా ననుటకు మే లనంగఁ
బ్రోక్షింప మిక్కిలి పోషింప దేవాది
              తర్పణాలకు నీళ్ళు త్రాగుటకును
హస్తికుంభస్థలం బందుఁదట్టుటకును
              దగ జెట్లు భుజములు దట్టుటకును
శాంతుఁడు ననుటకుఁ జల్లన యనుటకు
              సాబాసు మంచిది చాలు ననను


గీ.

సర్పశీర్షంబు హస్తంబు సరవిగాను
నిన్నితావుల వర్తించు నింది రేశ!
సరసగుణహార! శ్రీరంగపురవిహార!
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

34

మృగశీర్షహస్తలక్షణము

గీ.

అరయఁగా సప్తశీర్షంపు హస్తమందుఁ
గూర్మిఁగొన వ్రేలు మఱియు నంగుష్ఠ మమర
దాఁప మృగశీర్షహస్త మై తనరుచుండు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

35

మృగశీర్షహస్తవినియోగము

సీ.

పడతులు చెక్కిళ్ళఁ బసుపు పూయుటకును
              రాజీవ నేత్ర మర్యాద యనను
వచ్చెడు ననుటకు నాదంబు సేయను
              సోఁకోర్చుకొన గోడఁజూపుటకును
నెదురెదురనుటకు నిల్లు సూపుటకును
              నొనరఁగా బిలువను నుండు మనను
మఱి మ్రుగ్గు వెట్టను దిరుగాడుటకు నింకఁ
              బేర్మిఁ ద్రిపుండ్రంబు వెట్టుటకును

  1. ‘చందనే భుజగే మందే ప్రోక్షణే పోషణాదిషు| దేవర్ష్యుదకదానేషుహ్యాస్ఫాలే గజకుంభయోః|| గజాస్ఫాలేతు మల్లానాం యుజ్యతే సర్పశీర్షకః’ అభి 828