పుట:అభినయదర్పణము.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కానికానీ యని మేను సూపుటకును
              నిలలోన భేరి వ్రాయించుటకును
కొనలు సూపుటకును గూర్మి సలాముకుఁ
              జిక్కిపోవుటకును ముక్కునకును


గీ.

గట్టివా డనుమెచ్చుకు గరిమ మీఱ
సొరిది నూగారుబారులఁ జూపుటకును
సూచిహస్తంబు వచ్చును సొంపు మీఱ
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

29

చంద్రకళాహస్తలక్షణము: వినియోగము

గీ.

మొనసి తర్జనికాంగుష్ఠములను జాఁప
నవనిఁ జంద్రకళాహస్తమగును మిగుల
విదియచంద్రుని కిది చెల్లు విమలచరిత!
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

30

కోశహస్తలక్షణము

గీ.

వెలయ విరళంబుగా నైదువ్రేళ్ళు సాఁచి
కొనలుఁగొంచెము వంచినఁ గోశ మగును
సరసగుణహార! శ్రీరంగపురవిహార!
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

31

కోశహస్తవినియోగము

చ.

అనిశము పుట్టకుం బరఁగు నంతటఁ జెట్లకు స్వల్పభోజనం
బునకును బూలబంతులకుఁ బొందుగ ముగ్ధలు చెండ్లు చూపనున్
బనుపడఁ బూలబుట్టకును బాగుగ వడ్డన చేయుగిన్నెకు
న్నెనయును గోశహస్త మిల నింపుగఁ గస్తురిరంగనాయకా!

32

సర్పశీర్షహస్తలక్షణము

గీ.

అరయఁదొలుద తటి సపతాకహస్తమునకుఁ
గొంచెముగ వ్రేళ్ళనన్నిటి వంచియండ
నిలను మఱి సర్పశీర్ష మై చెలువు మీఱు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

33