పుట:అభినయదర్పణము.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కపిత్థహస్తవినియోగము

చ.

ఇరవుగ లక్ష్మివాణులకు నింపుగఁ దాళము వట్టునందుకుం
బరఁగను బాగ సుట్టుటకుఁ బాలను బిండను గొంగువట్టనుం
దిరముగఁబూలు సుట్టఁగను దీపము ధూపముఁ జూపఁజిల్కకున్
మెఱయఁ గపిత్థహస్తమగు మేల్మిని గస్తురిరంగనాయకా!

25

కటకాముఖహస్తలక్షణము

ఉ.

చేరిన ముష్టిహస్తమునఁ జెన్నుగ మధ్యపు వ్రేలిక్రిందుగాఁ
గూరిమి బొట్టవ్రేలి నదె గ్రుచ్చుక తక్కినవ్రేళ్ళు చేరినన్
వారిజనాభ! యింక విను వైపుగనుం గటకాముఖంబు నా
సారెకుఁ దేజరిల్లు నిలఁ జక్కని కస్తురిరంగ నాయకా!

26

కటకాముఖహస్తవినియోగము

చ.

నిరతము వజ్రముష్టికిని నేర్పున బాణము నేయ నంగడాల్
గరిమను బట్టి యెత్తుటకు గట్టిగ నాజముధాటిపోటుకుం
దిరముగ వచ్చు నిందులను దేవర! యీకటకాముఖంబు దాఁ
గరివరదాప్రమేయ! భవఖండన! కస్తురిరంగనాయకా!

27

సూచిహస్తలక్షణము

గీ.

సరగఁ దర్జనివ్రేలిని జాఁచిపట్టి
కడమవ్రేళ్ళను మడఁచిన గట్టిగాను
సూచిహస్తం బనంగను సొంపు మీఱు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

28

సూచిహస్తవినియోగము

సీ.

పరఁగనొక్కటి పరబ్రహ్మంబుననుటకుఁ
              జామరంబునకును జగతి యనను
నినునికి నూటికి నిదియది యనుటకు
              జడకు ఛత్రంబు కాశ్చర్యమునకు