పుట:అభినయదర్పణము.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముష్టిహస్తవినియోగము

చ.

స్థిరముగ జుట్టు పట్టుకొని జెట్లదె యుద్ధముచేయ నందునున్
నిరతము దారహారములు నేర్పుగనున్ గళమందు వేయనున్
గరిమను దట్టిచే నడుముగట్టను దన్నెదిరించు వారలం
బరఁగను గొట్ట ముష్టి యిదె వచ్చును గస్తురిరంగనాయకా!

21

శిఖరహస్తలక్షణము

గీ.

ముష్టిహస్తాన నంగుష్ఠ మూర్ధ్వముగను
జెలువు మీఱఁగ నెత్తిన శిఖరమౌను
సరసగుణహార! శ్రీరంగపురవిహార!
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

22

శిఖరహస్తవినియోగము

సీ.

వెడ విల్తునికి మఱి విలువట్టుటకును నా
              లింగమునకును లింగమునకుఁ
జెలువొంద గోపురశృంగంబుఁ జూపను
              నిది నిశ్చయంబన నేమి యనను
బేర్మి దంతముఁజూపఁ బితృతర్పణమునకుఁ
              గంబమునకు నధరంబునకును
ఘంట వాయింపను గా దని పల్కను
              నెదిరిని నొడి వట్టి యీడ్చుటకును


గీ.

బరఁగ శ్రేష్ఠంబు ననుటకు భయమునకును
శిఖరహస్తంబు వచ్చును జెన్నుమీఱ
సరసగుణహార! శ్రీరంగపురవిహార!
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

23

కపిత్థహస్తలక్షణము

చ.

తగవుగ ముష్టిహస్తమునఁ దర్జనివ్రేలిని నెత్తి వంచియు
న్నెగడు కనిష్ఠకన్ వెలిగ నేర్పునఁ గొంచెము వంచిపట్టినం
బొగడఁ గపిత్థ హస్తమయి ధారgణిలోఁ జెలంగు నో
నగధర! వాసుదేవ! యదునందన! కస్తురిరంగనాయకా!

24