పుట:అభినయదర్పణము.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బరమేశ్వరునకును బద్మనాభునకును
              సొరిదిఁ బ్రకాశంబుఁ జూపుటకును


గీ.

వేడ్క రతికేళి మఱి కూడి వీడుటకును
నిన్నితావుల వర్తించి చెన్ను మీఱు
నిలను ద్రిపతాకహస్తంబు నిందిరేశ!
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

7

అర్థపతాకహస్తలక్షణము

గీ.

ఎనయఁ ద్రిపతాకహస్తమందునఁ గనిష్ఠ
వ్రేలు గూరిచి వంచిన వివరముగను
ధరణిలోఁజూడ నర్థపతాకమయ్యె
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

8

అర్థపతాకహస్తవినియోగము

గీ.

చిగురుకును [1]ఛురికకు ధ్వజశృంగములకు
రమణినుదిటికి రెంటికి ఱంపమునకు
వచ్చు నర్థపతాకంబు వైపుమీఱ
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

9

కర్తరీముఖలక్షణము

గీ.

అరయ నర్థపతాకంబునందు మిగులఁ
దర్జనిక వ్రేలు వెలిగాను చాఁచి యున్నఁ
గర్తరీముఖహస్తమై ఘనత కెక్కు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

10

కర్తరీముఖహస్తవినియోగము

చ.

మరణము భేదమున్ మెఱపు మాటికినిం గడకంటి దృష్టియున్
వెరవుగఁ దల్ల క్రిందులను వేదనచేఁ దమిచేతఁ బొర్లునున్
నిరతము దీగెలల్లుకొను నేర్పును వచ్చిన నిన్నితావులన్
వరుసగఁ గర్తరీముఖము వైపుగఁ గస్తురిరంగనాయకా!

11
  1. “క్రకచే ఛురికాయాంచ ధ్వజే గోపుర శృంగయోః” అభి 236