పుట:అభినయదర్పణము.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పతాకహస్తవినియోగము

వ.

మఱియు నాట్యారంభమందు, మేఘమందు, వలదనుటయందు, నిశియందు, వాయుస్పర్శంబులయందు, ఖడ్గములయందు, నమరబృందములఁ జూపుటయందుఁ, దరంగంబులయందు, ఖడ్గములయందుఁ, దాపములయందు, ధారణియందు, నాశీర్వాదములయందుఁ, దాననుటయందు, నక్కడక్కడననుటయందు, శపథంబునందు, శయనంబునందుఁ, [1]దాళపత్రములయందుఁ, [2]బ్రతాపమునందు, ఫలద్రవ్యాదిస్పర్శంబులయందు, నశ్వమందు, ఖండించుటయందు, నంబుధియందు, దొడ్డవార లనుటయందు, దొరలయందు, దినమాసవర్షసూచనలయందుఁ, గవాటంబులు మూసి తెఱచుటయందుఁ, బొమ్మనుటయందు, శ్లాఘించుటయందు, నంగాదిస్పర్శంబులయందు, సమమనుటయందు, సప్తవిభక్తులతెఱఁగుం జూపుటయందుఁ, బ్రసాదంబు గైకొనుటయందుఁ, గరతాడనంబులయందుఁ, బీఠంబులయందు, మానినీమణులకుచస్థలిం బట్టుటయందుఁ, బతాకహస్తంబు వర్తించుచుండు, నంత

5

త్రిపతాకహస్తలక్షణము

క.

మఱియును సపతాకంబుగ
వరుస ననామికపువ్రేలు వంచిన నదియున్
ఇరువుగఁ ద్రిపతాకం బని
గరిమను జెలువొందుచుండుఁ గస్తురిరంగా!

6

త్రిపతాకహస్తవినియోగము

సీ.

వెలయుచుండుఁ గిరీటవృక్షంబులకు మఱి
              పాకశాసనునకు బాణమునకు
మొగిలిపుష్పానకు మొనయు చెక్కిళ్ళకు
              మెలఁగు వహ్ని జ్వాల మెఱపులకును
దనరు వజ్రాయుధంబునకు దీపమునకు
              నేపు మీఱఁగ ద్రిప్పిచూపుటకును

  1. తాళపత్రముల గుఱించి చెప్పుటయందు “తాళపత్రే చపేటేచ ద్రవ్యాదిస్పర్శనే తథా” అభి 212
  2. ప్రతాపమును గూర్చి పలుకునప్పుడు “ప్రతాపేచ ప్రసాదేచ చంద్రికాయాం ఘనాతపే” అభి 210