పుట:అభినయదర్పణము.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

[1]బంచశత్కోటియోజనపరిమిత మది
పరఁగ బంగారువర్ణ[2]మై పరిఢవిల్లు
సరసగుణహార! శ్రీరంగపురవిహార!
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

36

భూమిలక్షణము

క.

చెలఁగ సుభద్రయు భద్రక
తుల లేనటువంటి పూర్ణధూమ్ర యనంగా
నిల మఱి నాలుగునిధములు
గలిగియు శోభిల్లుచుండుఁ గస్తురిరంగా!

37

సుభద్రాభూమిలక్షణము

సీ.

నయ మొప్ప ధాత్రియు నాల్గుకోణంబు లై
              వైపుగా బంగారు వర్ణ మమరి
ప్రియ మొందఁగ లకారబీజసంయుక్త మై
              పరమేష్ఠి దేవతై పరఁగుచుండు
సరవిని మఱి చరాచరములు ధరియించి
              తగ సమస్తమున కాధార మగుచు
సలలితంబుగఁ బంచశత్కోటియోజన
              విస్తీర్ణముం గల్గి వేడ్క మీఱ


గీ.

గరిమ నాధారశక్తి గాఁ గమఠ మమరి
యష్టదిగ్దంతులను బైని నలరఁగాను
బరఁగ శేషునిపైని సుభద్ర మెఱసె
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

38

భద్రకాభూమిలక్షణము

గీ.

సరగ మఱి విష్ణుశక్తిచే శంఖవర్ణ
మొదవి నవరత్నమయముగా ముదము మీఱి

  1. ‘పంచాశత్కోటి’ అనుటకు ‘పంచశత్కోటి’ అనుట కవి ప్రమాదము.
  2. కలిగి