పుట:అభినయదర్పణము.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

జెలఁగి యధిదేవతలు గాను జెలువు మీఱి
యలచతుర్వింశ దేవతల్ వెలసి మిగుల
నలరియుండుదు రీ రంగయంత్రమునకు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

34

రంగపూజాద్రవ్యములు

సీ.

గణనాథునికి మంచిగరికె [1]సమర్పణ
              శ్రీషణ్ముఖునకు [2]నక్షింతలొప్ప
నిల క్షేత్రపాలున కిం పొంద జాజులు
              దిలలును నల నాందిదేవతలకు
సరవి మీఱంగను సప్తమాతృకలకుఁ
              గూరిమి యగు జపాకుసుమములును
సరగఁ ద్రిమూర్త్యాది సకలదేవతలకు
              మల్లెలు మొల్లలు మంచివిరులు


గీ.

నెనసి యీరీతి వారి కర్చన మొనర్చి
వెలయుఫలముల నైవేద్యములను సల్పి
వందనంబుల నొనరింపవలయుఁ జుమ్ము!
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

35

భూమ్యుద్భవలక్షణము

సీ.

సరవిగా నంబరశబ్దంబువలనను
              వాయువు పుట్టెను వరుసగాను
సరగ నవ్వాయుసంస్పర్శంబువలనను
              బొలు పొందఁ దేజంబు గలిగె నంతఁ
గూర్మిఁ [3]దేజసత్త్వగుణమువలనఁ జాల
              నొప్పుగఁ నటు ధాత్రి యుద్భవించెఁ

  1. ఈపదము గణనాథుకు మంచి గరికె సమర్పణ; శ్రీషణ్ముఖునకు అక్షింతలు (ఒప్పన్) సమర్పణ — అను రీతిని బ్రతివాక్యమునకు సంబంధించును.
  2. 'అక్షతములు' అను శబ్దమునుండి యేర్పడిన వికృతి (చూ. రుక్మాం. 4,89)
  3. ‘ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్యః పృథివీ’ అని యుపనిషత్తు.