పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

అనుభవసారము


ముట్టియు నొక్కటి ముట్టలే దెమ్మెయి
          నడుగొత్తకున్నట్టు నడచు పథము
వక్త్రంబు నొకఁడు జిహ్వ యొకఁడు గైకొను
          రుచులను భోగించు ధృతి నొకండు
దృష్టి వారనిచూపు దృఢము సద్భావన
          దా లేక వర్తించుఁ దాన చొచ్చి


గీ.

కాలియున్న నులుక గగనంబుదీధితి
యింద్రధనువుభాతి యెట్టు లట్లు
పట్టు లేక యాడి బైలికి నాశ్రయం
బగుప్రసాదిమహిమఁ బొగడఁ దరమె?

231


సీ.

నడచుచోఁ బ్రాణేశునకు వాహనము, నిల్చు
         చోనీడ, గూర్చుండుచోట గద్దె,
పూజించుచో [1]సజ్జ, భుజియించుచోఁ బాత్ర,
         భజియించుచో శుద్ధభక్తిభాతి,
మెలఁగెడిచో సంబవులు, పవళించుచోఁ
         బాన్పు, నిద్రించుచోఁ బ్రాణపదము,
తలఁచుచోఁ జిత్తంబు, పలుకుచో నాలుక,
         సత్క్రియావ్యాప్తిచే జంత్రబొమ్మ,


గీ.

అవికలేంద్రియానుభవసుఖవ్యాప్తిచే
లింగి దాన యై యభంగలీల
సహజలింగమథనసంతతసుఖసుధా
శరధిమగ్నుఁ డై ప్రసాది యుండు.

232
  1. సెజ్జ