పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుభవసారము

61


సీ.

పుట్టియుఁ బుట్టక పుట్టు మహత్త్వంబు
         కలిగియుఁ గలుగక కలుగు గుణము
పాసియుఁ బాయక పాయు వివేకంబు
         చేసియుఁ జేయక చేయు బెడఁగు
ముట్టియు ముట్టక ముట్టించుఁ చతురత
         పొందియుఁ బొందక పొందు సుఖము
తలఁచియుఁ దలఁచక తలఁచెడు తత్త్వంబు
         మఱచియు మఱవక మఱచు పదము


గీ.

అజ్జ లేనినీడ యన లేనిశబ్దంబు
రెండు లేనిమొదలు నిండియున్న
యఱయుఁ బొరయు లేనియానందనీరధిఁ
దరుచు శరణునెళవు తరమె పొగడ?

233

చతుర్విధకందము

ప్రథమకందము

క.

శ్రీరుద్రు నీలగళుఁ ద్రిపు
రారిం గొలువంగ [1]భవభయాదులఁ దెలియున్
దా రుద్రుఁ డైనత్రిపురవి
దారిం దలఁపంగఁ దలఁపు దా నై కలియున్.

234

ద్వితీయకందము

క.

కొలువంగ భవభయాదులఁ
దెలియుం దా రుద్రుఁ డైనత్రిపురవిదారిం
దలపంగఁ దలఁపు దా నై
కలియున్ శ్రీరుద్రు నీలగళుఁ ద్రిపురారిన్.

235
  1. భవభయాదులు పొలియున్