పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుభవసారము

59


సీ.

ప్రాణేశునకుఁ దనప్రాణంబు వల్లభి
          సన్మనోభావంబు సజ్జపట్టు
చిత్తాగ్ర ముత్తుంగసింహాసనము హృద
         యాబ్జమధ్యంబు విహారభూమి
యింద్రియపంచకం బిలుపుట్టులెంకలు
         పురుషుఁ డ[1]య్యెడకాఁడు బుద్ధి మంత్రి
పంచవింశతిగుణప్రతతులు బంటులు
         దేహంబు వరవుడు ధృతియు గతియు


గీ.

సజ్జనోపచారసమితియే శృంగార
[2]ముఖనియోగభోగములుగఁ జేసి
యుభయమథనసుఖనియుక్తియే ముక్తిగాఁ
జనుప్రసాది నెట్లు సంస్తుతింప?

228


చ.

వరుని సుబుద్ధిమైఁ దగిలి వల్లభు నాత్మ[3]గుఱించి జీవితే
శ్వరుని మనంబులో నిలిపి స్వామి నొడం[4]బఱిపించి నాథు హృ
త్సరసిజమందు నిల్పి విభుసమ్మతి గూర్చి స్వతంత్రలింగముం
జిరమతిఁ బ్రాణసంగతునిఁ జేసి ప్రసాది మథించు[5]చుండుఁదాన్.

229


క.

సర్వద్రవ్యవితానము
శర్వార్పిత మైన యాప్రసాదం బది దాఁ
బూర్వంబుపేరఁ బల్కుట
సర్వాంగద్రోహ మది ప్రసాదం బగునే?

230


సీ.

అంగంబు లే దుత్తమాంగంబు గూడ నా
          పాదమస్తకమును బాహుసమితి

  1. య్యెడగర్ర
  2. ముగను యోగిభోగముఖ్యుఁ జేసి
  3. గురించి
  4. బరికించి
  5. చుండుతన్.