కంటిమి నేడిదె గరుడాచలపతి

వికీసోర్స్ నుండి
కంటిమి నేడిదె గరుడాచలపతి(రాగం: ) (తాళం : )


కంటిమి నేడిదె గరుడాచలపతి
ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు ||

శ్రి నరసింహుడు చిన్మయ కంతుదు
దానవాంతకుడు దయానిధి
నానా మహిమల నమ్మిన వారిని
పూనిక కాచే పోషకుడితడు ||

దేవాదిదేవుడు దినకర తేజుడు
జీవాంతరంగుడు శ్రీ విభుడు
దైవశిఖామని తలచిన వారిని
సేవలు గొని కాచే విభుడితదు ||

పరమ మూర్తి హరి ప్రహ్లాద వరదుడు
కరుణానిధి బుధ కల్పము,
పరగు శ్రీ వెంకటపతి తన దాసుల
అరుదుగ కాచే అనంతుడితడు. ||


Kamtimi naedide garudaachalapati(Raagam: ) (Taalam: )

Kamtimi naedide garudaachalapati,
imti vaelupagu eesvaruditadu

Sri narasimhudu chinmaya kamtudu
daanavaamtakudu dayaanidhi
Naanaa mahimala nammina vaarini
poonika kaachae poshakuditadu

Daevaadidaevudu dinakara taejudu
jeevaamtaramgudu Sree vibhudu
Daivasikhaamani talachina vaarini
saevalu goni kaachae vibhuditadu

Parama moorti hari prahlaada varadudu
karunaanidhi budha kalpamu,
Paragu Sree vemkatapati tana daasula
aruduga kaachae anamtuditadu.

బయటి లింకులు[మార్చు]


అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |