ఈ పాదమే కదా

Wikisource నుండి

ఈ పాదమే కదా(రాగం: ) (తాళం : )

ఈ పాదమే కదా ఇలయెల్ల గొలిచినది ఈ పాదమే కదా ఇందిరా హస్తముల సితవైనది॥

ఈ పాదమే కదా ఇందరును మ్రొక్కెడిది ఈ పాదమే కదా ఈ గగనగంగ పుట్టినది ఈ పదమే కదా యెలమి పెంపొందినది ఈ పాదమే కదా ఇన్నిటికిని యెక్కుడైనది॥

ఈ పాదమే కదా యిభరాజు దలచినది ఈ పాదమే కదా యింద్రాదులెల్ల వెదకినది ఈ పాదమే కదా యీబ్రహ్మ కడిగినది ఈ పాదమే కదా యెగసి బ్రహ్మాండమంటినది॥

ఈ పాదమే కదా ఇహపరము లొసగెడిది ఈ పాదమే కదా ఇల నహల్యకు కోరికైనది ఈ పాదమే కదా యీక్షింప దుర్లభము ఈ పాదమే కదా ఈ వేంకటాద్రిపై నిరవైనది॥


Ee paadamae (Raagam: ) (Taalam: )

Ee paadamae kadaa ilayella golichinadi Ee paadamae kadaa imdiraa hastamula sitavainadi

Ee paadamae kadaa imdarunu mrokkedidi Ee paadamae kadaa ee gaganagamga puttinadi Ee padamae kadaa yelami pempomdinadi Ee paadamae kadaa innitikini yekkudainadi

Ee paadamae kadaa yibharaaju dalachinadi Ee paadamae kadaa yimdraadulella vedakinadi Ee paadamae kadaa yeebrahma kadiginadi Ee paadamae kadaa yegasi brahmaamdamamtinadi

Ee paadamae kadaa ihaparamu losagedidi Ee paadamae kadaa ila nahalyaku korikainadi Ee paadamae kadaa yeekshimpa durlabhamu Ee paadamae kadaa ee vaemkataadripai niravainadi


[మార్చు] బయటి లింకులు

I-PadameKada-BKP






అన్నమయ్య పాటలు ఫైలు:Annamacharya.jpg
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


పేజీ లింకులు