ఇతరులకు నిను నెరగతరమా
Wikisource నుండి
ఇతరులకు నిను నెఱగతరమా సతత సత్యవ్రతులు సంపూర్ణమోహవిర- హితలెఱుగుదురు నిను నిందిరారమణా॥
నారీకటాక్షపటునారాచభయరహిత- శూరులెఱుగుదురు నిను చూచేటిచూపు ఘోరసంసార సంకులపరిచ్చేదులగు- ధీరులెఱుగుదురు నీదివ్యవిగ్రహము॥
రాగభోగవిదూరరంజితాత్ములు మహా- భాగులెరుగుదురు నిను ప్రణుతించువిధము ఆగమోక్తప్రకారాభిగమ్యులు మహా- యోగులెఱగుదురు నీవుండేటివునికి॥
పరమభాగవత పదపద్మసేవానిజా- భరణులెఱుగుదురు నీ పలికేటిపలుకు పరగునిత్యానందపరిపూర్ణ మానస- స్థిరులెఱుగుదురు నిను తిరువేంకటేశ॥
Itarulaku ninu ne~ragataramaa Satata satyavratulu sampoornamohavira- Hitale~ruguduru ninu nimdiraaramanaa
Naareekataakshapatunaaraachabhayarahita- Soorule~ruguduru ninu choochaetichoopu Ghorasamsaara samkulaparichchaedulagu- Dheerule~ruguduru needivyavigrahamu
Raagabhogavidooraramjitaatmulu mahaa- Bhaaguleruguduru ninu pranutimchuvidhamu Aagamoktaprakaaraabhigamyulu mahaa- Yogule~raguduru neevumdaetivuniki
Paramabhaagavata padapadmasaevaanijaa- Bharanule~ruguduru nee palikaetipaluku Paragunityaanamdaparipoorna maanasa- Sthirule~ruguduru ninu tiruvaemkataesa
[మార్చు] బయటి లింకులు
| అన్నమయ్య పాటలు | ఫైలు:Annamacharya.jpg |
|---|---|
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|
|