ఇతనికంటె ఘనులిక లేరు
Wikisource నుండి
ఇతనికంటె ఘనులిక లేరు యిరర దేవతల యిందరిలోన॥
భూపతి ఈతడె పొదిగి కొలువరో శ్రీపతి ఈతడే చేకొనరో యేపున బలువుడు నీతడే చేరరో పైపై వేంకటపతి యైనాడు॥
మరుగురుడితడే మతి నమ్మగదరో పరమాత్ముడితడే భావించరో కరివరదుడితడే గతియని తలచరో పరగ శ్రీ వేంకటపతియైనాడు॥
తల్లియు నితడే తండ్రియు నితడే వెల్లవిరై యిక విడువకురో చల్లగా నితని శరణని బ్రతుకరో అల్ల శ్రీ వేంకటహరి అయినాడు॥
Itanikamte ghanulika laeru Yirara daevatala yimdarilona
Bhoopati eetade podigi koluvaro Sreepati eetadae chaekonaro Yaepuna baluvudu neetadae chaeraro Paipai vaemkatapati yainaadu
Maruguruditadae mati nammagadaro Paramaatmuditadae bhaavimcharo Karivaraduditadae gatiyani talacharo Paraga Sree vaemkatapatiyainaadu
Talliyu nitadae tamdriyu nitadae Vellavirai yika viduvakuro Challagaa nitani saranani bratukaro Alla Sree vaemkatahari ayinaadu
[మార్చు] బయటి లింకులు
| అన్నమయ్య పాటలు | ఫైలు:Annamacharya.jpg |
|---|---|
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|
|