అనరాదు వినరాదు ఆతని
Wikisource నుండి
ప|| అనరాదు వినరాదు ఆతని మాయలు నేడు | దినదిన క్రొత్తలాయ ద్రిష్టమిదే మాకు ||
చ|| ఆడెడి బాలుల హరి అంగలి చూపుమని | తోడనే వాండ్ల నోర దుమ్ములు చల్లి | యీడమాతో చెప్పగాను యిందరము గూడిపోయి | చూడపోతే పంచదారై చోద్యమాయనమ్మా ||
చ|| తీట తీగెలు సొమ్మంటూ దేహము నిండ గట్టె | తీటకుగాక బాలులు తెగి వాపోగా | పాటించి యీసుద్దివిని పారితెంచి చూచితేను | కోటికోటి సొమ్ములాయ కొత్తలోయమ్మా ||
చ|| కాకి జున్ను జున్నులంటా గంపెడేసి తినిపించి | వాకొలిపి బాలులెల్ల వాపోగా | ఆకడ శ్రీవేంకటేశుడా బాలుల కంటి నీరు | జోకగ ముత్యాలుసేసె జూడగానే నేము ||
pa|| anarAdu vinarAdu Atani mAyalu nEDu | dinadina krottalAya driShTamidE mAku ||
ca|| ADeDi bAlula hari aMgali cUpumani | tODanE vAMDla nOra dummulu calli | yIDamAtO ceppagAnu yiMdaramu gUDipOyi | cUDapOtE paMcadArai cOdyamAyanammA ||
ca|| tITa tIgelu sommaMTU dEhamu niMDa gaTTe | tITakugAka bAlulu tegi vApOgA | pATiMci yIsuddivini pAriteMci cUcitEnu | kOTikOTi sommulAya kottalOyammA ||
ca|| kAki junnu junnulaMTA gaMpeDEsi tinipiMci | vAkolipi bAlulella vApOgA | AkaDa SrIvEMkaTESuDA bAlula kaMTi nIru | jOkaga mutyAlusEse jUDagAnE nEmu ||
[మార్చు] బయటి లింకులు
| అన్నమయ్య పాటలు | ఫైలు:Annamacharya.jpg |
|---|---|
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|
|