అదె శిరశ్చక్రములేనట్టిదేవర

Wikisource నుండి

అదె శిరశ్చక్రములేనట్టిదేవర (రాగమ్: ) (తాలమ్: )

ప|| అదె శిరశ్చక్రములేనట్టిదేవర లేదు | యిదె హరిముద్రాంకిత మిందే తెలియరో ||

చ|| "అనాయుధాసో అసురా అదేవా" యని | వినోదముగ ఋగ్వేదముదెలిపెడి | సనాతనము విష్ణుచక్రధారునకును | అనాది ప్రమాణమందే తెలియరో ||

చ|| "యచ్చ యింద్రే" యని "యచ్చ సూర్యే" యని | అచ్చుగ తుదకెక్క నదె పొగడీ శ్రుతి | ముచ్చట గోవిందుని ముద్రధారణకు | అచ్చమయిన ప్రమాణమందే తెలియరో ||

చ|| మును "నేమినా తప్త ముద్రాం ధారయే" త్తని | వెనువేంకటశ్రుతి యదె వెల్లవిరిసేసీని | మొనసి శ్రీవేంకటేశు ముద్రధారణకు | అనువుగ బ్రమాణమందే తెలియరో ||


ade SiraScakramulEnaTTidEvara (Raagam: ) (Taalam: )

pa|| ade SiraScakramulEnaTTidEvara lEdu | yide harimudrAMkita miMdE teliyarO ||

ca|| "anAyudhAsO asurA adEvA" yani | vinOdamuga RugvEdamudelipeDi | sanAtanamu viShNucakradhArunakunu | anAdi pramANamaMdE teliyarO ||

ca|| "yacca yiMdrE" yani "yacca sUryE" yani | accuga tudakekka nade pogaDI Sruti | muccaTa gOviMduni mudradhAraNaku | accamayina pramANamaMdE teliyarO ||

ca|| munu "nEminA tapta mudrAM dhArayE" ttani | venuvEMkaTaSruti yade vellavirisEsIni | monasi SrIvEMkaTESu mudradhAraNaku | anuvuga bramANamaMdE teliyarO ||


[మార్చు] బయటి లింకులు





అన్నమయ్య పాటలు ఫైలు:Annamacharya.jpg
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |


పేజీ లింకులు