అతి సులభం బిదె శ్రీపతి శరణము అందుకు నారదాదులు సాక్షి
Wikisource నుండి
అతి సులభం బిదె శ్రీపతి శరణము అందుకు నారదాదులు సాక్షి ప్రతిలే దిదియే నిత్యానందము బహువేదంబులె యివే సాక్షి
వేసరకుమీ జీవుడా వెదకివెదకి దైవమును ఆసపాటుగా హరి యున్నా డిదె అందుకు ప్రహ్లాదుడు సాక్షి మోసపోకుమీ జన్మమా ముమ్చినయనుమానములను సేసినభక్తికి జేటు లేదు యీనేత కెల్ల ధ్రువుడే సాక్షి
తమకించకుమీ దేహమా తగుసుఖదు:ఖంబుల నలసి అమితము నరహరికరుణ నమ్మితే నందుకు నర్జునుడే సాక్షి భ్రమయకుమీ వివేకమా బహుకాలంబులు యీదీది తమితో దాస్యము తను రక్షించును దానికి బలీంద్రుడే సాక్షి
మరిగివుండుమీ వోజిహ్వా మరి శ్రీవేంకటపతిసుతులు అరయగ నిదియే యీడేరించును అందుకు వ్యాసాదులె సాక్షి తిరుగకుమీ విజ్ఞానమా ద్రిష్టపుమాయలకును లోగి సరిలే దితనిపాదసేవకును సనకాదులబ్రదుకే సాక్షి
Ati sulabham bide Sreepati saranamu anduku naaradaadulu saakshi Pratile didiye nityaanandamu bahuvedambule yive saakshi
Vesarakumee jeevudaa vedakivedaki daivamunu Aasapaatugaa hari yunnaa Dide anduku prahlaadudu saakshi Mosapokumee janmamaa munchinayanumaanamulanu Sesinabhaktiki jetu ledu yeeneta kella dhruvude saakshi
Tamakinchakumee dehamaa tagusukhadu:khambula nalasi Amitamu naraharikaruna nammite nanduku narjunude saakshi Bhramayakumee vivekamaa bahukaalambulu yeedeedi Tamito daasyamu tanu rakshinchunu daaniki baleendrude saakshi
Marigivundumee vojihvaa mari sreevenkatapatisutulu Arayaga nidiye yeederinchunu anduku vyaasaadule saakshi Tirugakumee vijnaanamaa drishtapumaayalakunu logi Sarile ditanipaadasevakunu sanakaadulabraduke saakshi
[మార్చు] బయటి లింకులు
| అన్నమయ్య పాటలు | ఫైలు:Annamacharya.jpg |
|---|---|
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ
|
|