అతడే యెరుగును
Wikisource నుండి
ప|| అతడే యెరుగును మముబుట్టించిన యంతరాత్మయగు నీశ్వరుడు | అతికీనతుకదు చిత్తశాంతి యిదె ఆత్మవిహారంబిక నేదో ||
చ|| కనుచున్నారము సూర్యచంద్రులకు ఘన వుదయాస్తమయములు | వినుచున్నారము తొల్లిటివారల విశ్వములోపలి కథలెల్లా | మనుచున్నారము నానాటికి మాయల సంసారములోన | తనిసీ దనియము తెలిసీ దెలియము తరువాతి పనులిక నేవో ||
చ|| తిరిగెదమిదివో ఆసలనాసల దిక్కుల నర్ధార్జన కొరకు | పొరలెదమిదివో పుణ్యపాపముల భోగములందే మత్తులమై | పెరిగెదమిదివో చచ్చెడి పుట్టెడి భీతుగలుగు దేహములలోనే | విరసము లెరగము మరచీ మరవము వెనకటి కాలము విధియేదో ||
చ|| అట్లైనారము హరినుతిచే నాఱడి (బోవక) గురువనుమతిని | పట్టినారమిదె భక్తిమార్గమిదె (మును) బలువగు విజ్ఞానముచేత | గట్టిగ శ్రీవేంకటపతి శరణని కంటిమిదివొ మోక్షము తెరువు | ముట్టీముట్టము పట్టీపట్టము ముందటి కైంకర్యంబేదో ||
pa|| ataDE yerugunu mamubuTTiMcina yaMtarAtmayagu nISvaruDu | atikInatukadu cittaSAMti yide AtmavihAraMbika nEdO ||
ca|| kanucunnAramu sUryacaMdrulaku Gana vudayAstamayamulu | vinucunnAramu tolliTivArala viSvamulOpali kathalellA | manucunnAramu nAnATiki mAyala saMsAramulOna | tanisI daniyamu telisI deliyamu taruvAti panulika nEvO ||
ca|| tirigedamidivO AsalanAsala dikkula nardhArjana koraku | poraledamidivO puNyapApamula BOgamulaMdE mattulamai | perigedamidivO cacceDi puTTeDi BItugalugu dEhamulalOnE | virasamu leragamu maracI maravamu venakaTi kAlamu vidhiyEdO ||
ca|| aTlainAramu harinuticE nArxaDi (bOvaka) guruvanumatini | paTTinAramide BaktimArgamide (munu) baluvagu vij~jAnamucEta | gaTTiga SrIvEMkaTapati SaraNani kaMTimidivo mOkShamu teruvu | muTTImuTTamu paTTIpaTTamu muMdaTi kaiMkaryaMbEdO ||
[మార్చు] బయటి లింకులు
| అన్నమయ్య పాటలు | ఫైలు:Annamacharya.jpg |
|---|---|
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ
|
|