అడుగవయ్యా వరములాపె
Wikisource నుండి
ప|| అడుగవయ్యా వరములాపె నేమైనా నీవు | బడిబడి నిదివో ప్రత్యక్షమాయ నీకు ||
చ|| చెలయపేరే నీకు సేసే జపమంతములు | కలసేటి సన్నలే యంగన్యాసాలు | ములువాడి కొనగోరి మోపులే నానాముద్రలు | ఫలియించెదపమాపె ప్రత్యక్షమాయ నీకు ||
చ|| ఆపెపైజల్లేవలపదే తర్పణజలము | దీపించు నవ్వు పాయస దివ్యహోమము | దాపగు నీయథరామృతమే మంచిభోజనము | నీపాలబ్రత్యక్షమాయ నెలతె యిదె నీకు ||
చ|| పొందులకాగిటి రతి పురశ్చరణ ఫలము | అందియాపె చక్కని రూపది యంత్రము | యిందునె శ్రీవేంకటేశ యిటు నన్నుగూడితివి | అందమై ప్రత్యక్షమాయ నప్పటిదానె నీకు ||
pa|| aDugavayyA varamulApe nEmainA nIvu | baDibaDi nidivO pratyakShamAya nIku ||
ca|| celayapErE nIku sEsE japamaMtamulu | kalasETi sannalE yaMganyAsAlu | muluvADi konagOri mOpulE nAnAmudralu | PaliyiMcedapamApe pratyakShamAya nIku ||
ca|| ApepaijallEvalapadE tarpaNajalamu | dIpiMcu navvu pAyasa divyahOmamu | dApagu nIyatharAmRutamE maMciBOjanamu | nIpAlabratyakShamAya nelate yide nIku ||
ca|| poMdulakAgiTi rati puraScaraNa Palamu | aMdiyApe cakkani rUpadi yaMtramu | yiMdune SrIvEMkaTESa yiTu nannugUDitivi | aMdamai pratyakShamAya nappaTidAne nIku ||
[మార్చు] బయటి లింకులు
| అన్నమయ్య పాటలు | ఫైలు:Annamacharya.jpg |
|---|---|
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|
|