అట్టివేళ గలగనీ దదివో
Wikisource నుండి
ప|| అట్టివేళ గలగనీ దదివో వివేకము | ముట్టువడితే శాంతము మరి యేలా ||
చ|| జడధులు వొంగినట్టు సందడించు నింద్రియములు | వొడలిలో జీవునికి నొక్కొకవేళ | బడబాగ్ని రేగినట్లు పైకొనీ ముంగోపము | వుడికించు మననెల్ల నొక్కొకవేళా ||
చ|| అరయ గొండయెత్తినట్టు వేగౌ సంసారము | వూరక కలిమిలేము లొక్కొకవేళ | మేరలేనిచీకటియై మించును దుఃఖములెల్లా | వూరటలేనికర్మికి నొక్కొకవేళా ||
చ|| పెనుగాలి వీచినట్టు పెక్కుకోరికలు ముంచు | వొనర నజ్ఞానికి నొక్కొకవేళా | యెనయగ శ్రీవేంకటేశుదాసుడైనదాకా | వునికి బాయవన్నియు నొక్కొకవేళా ||
pa|| aTTivELa galaganI dadivO vivEkamu | muTTuvaDitE SAMtamu mari yElA ||
ca|| jaDadhulu voMginaTTu saMdaDiMcu niMdriyamulu | voDalilO jIvuniki nokkokavELa | baDabAgni rEginaTlu paikonI muMgOpamu | vuDikiMcu mananella nokkokavELA ||
ca|| araya goMDayettinaTTu vEgau saMsAramu | vUraka kalimilEmu lokkokavELa | mEralEnicIkaTiyai miMcunu duHKamulellA | vUraTalEnikarmiki nokkokavELA ||
ca|| penugAli vIcinaTTu pekkukOrikalu muMcu | vonara naj~jAniki nokkokavELA | yenayaga SrIvEMkaTESudAsuDainadAkA | vuniki bAyavanniyu nokkokavELA ||
[మార్చు] బయటి లింకులు
| అన్నమయ్య పాటలు | ఫైలు:Annamacharya.jpg |
|---|---|
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ
|
|