అటువంటి వైభవము లమర

Wikisource నుండి

అటువంటి వైభవము (రాగమ్: ) (తాలమ్: )

ప|| అటువంటి వైభవము లమర జేసిన దైవ- | మిటువంటి యోగంబు లిన్నియును జేసి ||

చ|| జలజాక్షి లావణ్య జలధినుప్పొంగిన | నలివేణి ముఖచంద్రు డభ్యుదయ మాయె | కలికి వలరాయడను కాలకూటంబుతో | దలకొన్న యధరామృతంబు జన్మించె ||

చ|| వనిత సౌభాగ్యంబు వనధిలోపల దోచె | గొనకొన్న గుఱుతైన కుచపర్వతములు | తనివోని కోరికల తగు తురంగములతో | ననువైన విరహ బడబానలము గలిగె ||

చ|| భామయవ్వన మనెడి పాలజలధిలోన | వామాక్షి యైన యవ్వన లక్ష్మి గలిగె | యీ మంచి తిరువేంకటేశ్వరుం డిందులో | బ్రేమమున సుఖియించి పెంపొందగలిగె ||


aTuvaMTi vaiBavamu (Raagam: ) (Taalam: )

pa|| aTuvaMTi vaiBavamu lamara jEsina daiva- | miTuvaMTi yOgaMbu linniyunu jEsi ||

ca|| jalajAkShi lAvaNya jaladhinuppoMgina | nalivENi muKacaMdru DaByudaya mAye | kaliki valarAyaDanu kAlakUTaMbutO | dalakonna yadharAmRutaMbu janmiMce ||

ca|| vanita sauBAgyaMbu vanadhilOpala dOce | gonakonna gurxutaina kucaparvatamulu | tanivOni kOrikala tagu turaMgamulatO | nanuvaina viraha baDabAnalamu galige ||

ca|| BAmayavvana maneDi pAlajaladhilOna | vAmAkShi yaina yavvana lakShmi galige | yI maMci tiruvEMkaTESvaruM DiMdulO | brEmamuna suKiyiMci peMpoMdagalige ||


[మార్చు] బయటి లింకులు





అన్నమయ్య పాటలు ఫైలు:Annamacharya.jpg
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |


పేజీ లింకులు