అందాకదాదానే అంతుకెక్కుడు

Wikisource నుండి

అందాకదాదానే అంతుకెక్కుడు (రాగమ్: ) (తాలమ్: )

ప|| అందాకదాదానే అంతుకెక్కుడు గాదు | ముందువెనుకంచేనా ముఖ్యుడే యతడు ||

చ|| చిత్తమంతర్ముఖము సేసుకొన నేర్చెనా | అత్తలనతడు యోగియనబడును | సత్తసత్తనెడి సువిచారంబు గలిగెనా | వుత్తమ వివేకియని వూహింపబడును ||

చ|| భావము నబావమును పరికించి తెలిసెనా | కైవల్యనిలయుడని కానబడును | దైవముదన్నుమతిదలపోయెనేర్చెనా | జీవన్ముక్తుడని చెప్పబడునతడు ||

చ|| అడరి వైరాగ్యధనమార్జించనోపెనా | దిడువై జితేంద్రియ స్థిరుడాతడు | జడియు శ్రీవేంకటేశ్వరుదాసుడాయనా | బడిబడిదుదబర బ్రహ్మమేయతడు ||



aMdAkadAdAnE aMtukekkuDu (Raagam: ) (Taalam: )

pa|| aMdAkadAdAnE aMtukekkuDu gAdu | muMduvenukaMcEnA muKyuDE yataDu ||

ca|| cittamaMtarmuKamu sEsukona nErcenA | attalanataDu yOgiyanabaDunu | sattasattaneDi suvicAraMbu galigenA | vuttama vivEkiyani vUhiMpabaDunu ||

ca|| BAvamu nabAvamunu parikiMci telisenA | kaivalyanilayuDani kAnabaDunu | daivamudannumatidalapOyenErcenA | jIvanmuktuDani ceppabaDunataDu ||

ca|| aDari vairAgyadhanamArjiMcanOpenA | diDuvai jitEMdriya sthiruDAtaDu | jaDiyu SrIvEMkaTESvarudAsuDAyanA | baDibaDidudabara brahmamEyataDu ||


[మార్చు] బయటి లింకులు





అన్నమయ్య పాటలు ఫైలు:Annamacharya.jpg
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |


పేజీ లింకులు