అందరి బ్రదుకులు నాతనివే
Wikisource నుండి
ప|| అందరి బ్రదుకులు నాతనివే | కందువెల్ల శ్రీకాంతునిదే ||
చ|| వేమరు జదివెడి విప్రుల వేదము | సోమకవైరి యశో విభవం | శ్రీమించు నమరుల జీవనమెల్ల సు- | ధామ ధనుని సంతత కరుణే ||
చ|| హితవగు నిలలో నీసుఖమెల్లను | దితి సుత దమనుడు దెచ్చినదే | తతి తల్లి దండ్రి తానై కాచిన | రతి ప్రహ్లాద వరదుని కృపే ||
చ|| అలరిన యమరేంద్రాదుల బ్రదుకులు | బలి బంధను కృప బరగినవే || బలసి మునుల యాపదలు వాపుటకు | బలునృప భంజను పరిణతలే ||
చ|| పూని యనాథుల పొందుగ గాచిన | జానకీ విభుని సరసతలే | నానా భూభరణంబులు నందుని | సూనుడు చేసిన సుకృతములే ||
చ|| తలకొని ధర్మము తానై నిలుపుట | కలుష విదూరుని గర్వములే | నిలిచి లోకములు నిలిపిన ఘనుడగు | కలియుగమున వేంకటపతివే ||
pa|| aMdari bradukulu nAtanivE | kaMduvella SrIkAMtunidE ||
ca|| vEmaru jadiveDi viprula vEdamu | sOmakavairi yaSO viBavaM | SrImiMcu namarula jIvanamella su- | dhAma dhanuni saMtata karuNE ||
ca|| hitavagu nilalO nIsuKamellanu | diti suta damanuDu deccinadE | tati talli daMDri tAnai kAcina | rati prahlAda varaduni kRupE ||
ca|| alarina yamarEMdrAdula bradukulu | bali baMdhanu kRupa baraginavE || balasi munula yApadalu vApuTaku | balunRupa BaMjanu pariNatalE ||
ca|| pUni yanAthula poMduga gAcina | jAnakI viBuni sarasatalE | nAnA BUBaraNaMbulu naMduni | sUnuDu cEsina sukRutamulE ||
ca|| talakoni dharmamu tAnai nilupuTa | kaluSha vidUruni garvamulE | nilici lOkamulu nilipina GanuDagu | kaliyugamuna vEMkaTapativE ||
[మార్చు] బయటి లింకులు
| అన్నమయ్య పాటలు | ఫైలు:Annamacharya.jpg |
|---|---|
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ
|
|