అంతయు నీవే హరి
Wikisource నుండి
ప|| అంతయు నీవే హరి పుండరీకాక్ష | చెంత నాకు నీవే శ్రీరఘురామ ||
చ|| కులమును నీవే గోవిందుడా నా | కలిమియు నీవే కరుణానిధి | తలపును నీవే ధరణీధర నా | నెలవును నీవే నీరజనాభ ||
చ|| తనువును నీవే దామోదర నా | మనికియు నీవే మధుసూదన | వినికియు నీవే విట్ఠలుడా నా | వెనకముందు నీవే విష్ణు దేవుడా ||
చ|| పుట్టుగు నీవే పురుషోత్తమ | కొన నట్టనడుము నీవే నారాయణ | ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు | నెట్టన గతి ఇంక నీవే నీవే ||
pa|| aMtayu nIvE hari puMDarIkAkSha | ceMta nAku nIvE SrIraGurAma ||
ca|| kulamunu nIvE gOviMduDA nA | kalimiyu nIvE karuNAnidhi | talapunu nIvE dharaNIdhara nA | nelavunu nIvE nIrajanABa ||
ca|| tanuvunu nIvE dAmOdara nA | manikiyu nIvE madhusUdana | vinikiyu nIvE viTThaluDA nA | venakamuMdu nIvE viShNu dEvuDA ||
ca|| puTTugu nIvE puruShOttama | kona naTTanaDumu nIvE nArAyaNa | iTTE SrI veMkaTESvaruDA nAku | neTTana gati iMka nIvE nIvE ||
[మార్చు] బయటి లింకులు
| అన్నమయ్య పాటలు | ఫైలు:Annamacharya.jpg |
|---|---|
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ
|
|